Yamadonga Re Release: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్... 'యమదొంగ' రీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఇక ఆ మూడు రోజులూ!
Yamadonga Re Release Date 2025: మే 20వ తేదీన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'యమదొంగ' సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే?

Jr NTR Birthday Special: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డేకి ఇంకా ఎన్నో రోజుల సమయం లేదు. మే 20వ తేదీన ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'యమదొంగ' సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అది ఏమిటో తెలుసా?
'యమదొంగ' హంగామా ఆ మూడు రోజులే!
Yamadonga re release date: 'యమదొంగ' సినిమాను వచ్చే నెలలో (అంటే మే 18వ తేదీన) రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజుతో పాటు 19, 20వ తేదీలలో థియేటర్లలో సందడి చేస్తుంది. 'యమదొంగ'గా ఎన్టీఆర్ హంగామా థియేటర్లలో ఆ మూడు రోజులే ఉంటుంది. అలాగని అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కంటిన్యూ చేసే ఛాన్సులు కూడా లేకపోలేదు.
రీ రిలీజ్ స్పెషల్ ఏర్పాట్లు... 8కే ప్రింట్ రెడీ!
భవిష్యత్తులో కూడా మళ్లీ విడుదల చేయడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా 'యమదొంగ' సినిమా ప్రింట్ 8కేలో రీస్టోర్ చేశారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు 4కేలో స్పెషల్ షోస్ వేయడానికి రెడీ అయ్యారు. ఏపీ, తెలంగాణ... ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ సినిమా మళ్లీ విడుదల కానుంది.
View this post on Instagram
ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)ది బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా 'స్టూడెంట్ నెంబర్ వన్'. ఆ తర్వాత చేసిన 'సింహాద్రి' ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక 'యమదొంగ' అయితే తాతకు తగ్గ మనవడు ఎన్టీఆర్ అని నిరూపించింది యమధర్మరాజు పాత్రలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో మరొకసారి యంగ్ యముడి హంగామా ఒక స్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: 'హనుమాన్' నిర్మాతను ఆ దర్శకులు ఇద్దరు ఛీట్ చేశారా? ఛాంబర్ మెట్లు ఎక్కిన వివాదం??
ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే...
Jr NTR Upcoming Movies: 'యమదొంగ' సినిమా చేసేటప్పుడు ఎన్టీఆర్ రేంజ్ వేరు, ఇప్పుడు ఆయన రేంజ్ వేరు. అంతర్జాతీయ స్థాయిలో 'ట్రిపుల్ ఆర్' సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా 'వార్ 2' సినిమా రూపొందుతోంది. దీని తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. దానికి 'డ్రాగన్' టైటిల్ ఖరారు చేశారు. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సీక్వెల్ కూడా చేయనున్నారు. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో 'దేవర 2' తప్పకుండా ఉంటుందని ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కన్ఫర్మ్ చేశారు.





















