Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP Desam
క్రికెట్ అంటేనే అంత ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ఇంకా ఐపీఎల్ అంటే గేమ్ కంటే బిజినెస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ విజయం ఉంటేనే మార్కెట్...ఓటములు వస్తుంటే వ్యాపారం డల్ అపోయిద్ది. అందుకే టీమ్ ఓనర్లు అంత ఎమోషనల్ గా కనిపిస్తూ ఉంటారు. ఐపీఎల్లో రీసెంట్ టైమ్ లో ఎక్కువగా డిస్కషన్ జరిగేది ఇద్దరు ఓనర్లు గురించే. ఒకరు హైదరాబాద్ సన్ రైజర్స్ ఓనర్ కావ్యా మారన్. మ్యాచ్ గెలుస్తుంటే సంతోషంగా చంటిపాపలా గంతులేసే ఆమే ఓడిపోతుంటే మాత్రం ఫుల్ గా డల్ అయిపోతారు. ఆమె ఎక్స్ ప్రెషన్స్ లో కనిపించిపోతుంది మ్యాచ్ రిజల్ట్ ఏంటో. సేమ్ టూ సేమ్ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా నుంచి కూడా. ఆయన అంతే మ్యాచ్ గెలిస్తే ఇదిగో నిన్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ పంత్ ను హగ్ చేసుకున్నట్లు చేసుకుంటారు. ఓడిపోతుంటే మాత్రం గ్రౌండ్ లోకి వచ్చి ఇంటర్నేషనల్ లెవల్ ప్లేయర్లు అని కూడా చూడకుండా కేఎల్ రాహుల్, పంత్ ను తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టాడు. నిన్న ఒకే మ్యాచ్ లో ఈ ఇద్దరి ఎమోషన్స్ వైరల్ అయ్యాయి. కావ్యా మారన్ డల్ ఫేస్ తో ఉన్న ఫోటోలను ఆరెంజ్ ఆర్మీ వైరల్ చేస్తూ నెక్ట్స్ మ్యాచ్ లో కొట్టేద్దాం డల్ కాకండి అని పోస్టులు పెడుతుంటే...మా గోయెంకా తాత చూడండి కోపం వస్తే తిడతారు ప్రేమ వస్తే ఇదిగో ఇలా హగ్ చేసుకుంటారు పంత్ ను హగ్ చేసుకున్న ఫోటోలను వైరల్ చేస్తున్నారు.





















