BCCI Job Information: టీం ఇండియాలో ఉద్యోగాలు, అర్హతలు ఏంటీ? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
BCCI Job Information: బీసీసీఐ భారత మహిళా క్రికెట్ జట్టులో ఖాళీలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలను బీసీసీఐ వెబ్‌సైట్‌లో పెట్టింది.

BCCI Job Information: భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఉద్యోగాలను ప్రకటించింది. బోర్డు బుధవారం ఖాళీల గురించి సమాచారం ఇచ్చింది. మహిళల టీమ్ ఇండియాకు ప్రధాన ఫిజియోథెరపిస్ట్, కోచ్ అవసరం. బిసిసిఐ ఖాళీలతోపాటు అర్హతలు, అనుభవం ఎంత ఉండాలి అనే వివరాలను కూడా స్పష్టంగా తెలిపింది. ఈ పదవుల్లో పని చేసే వ్యక్తులు ఆటగాళ్ల ప్రదర్శనను మెరుగుపరచడంలో సహాయపడతారు. అలాగే గాయాల తర్వాత వేగంగా కోలుకోవడానికి పనిచేస్తారు.
భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సీనియర్ మహిళల టీమ్ ఇండియా కోసం రెండు ప్రధాన పోస్టులు ఖాళీగా ఉన్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి పదవి ప్రధాన ఫిజియోథెరపిస్ట్ కోసం అయితే, రెండోది కండిషనింగ్ కోచ్ కోసం. ఈ రెండు పదవుల్లో పనిచేసే వ్యక్తులు బెంగళూరులో ఉన్న బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పని చేస్తారు. ఫిజియో బాధ్యత ఆటగాళ్లు గాయపడిన తర్వాత ఎక్కువగా ఉంటుంది. ఆటగాళ్ల త్వరగా కోలుకొని మళ్లీ మ్యాచ్‌లు ఆడేలా సహాయపడాలి. దీని కోసం ప్రతిరోజూ సెషన్లు ఉంటాయి.
ఫిజియో కోసం అప్లై చేయాలంటే ఎలాంటి అర్హత ఉండాలి -
స్పోర్ట్స్ లేదా మస్కులోస్కెలిటల్ ఫిజియోథెరపీ/స్పోర్ట్స్ అండ్ ఎక్సర్‌సైజ్ మెడిసిన్/స్పోర్ట్స్ రీహాబిలిటేషన్‌లో స్పెషలైజేషన్ ఉంటాలి. దీంతోపాటు ఈ ఫిజియో థెరపీ విభాగంలో పీజీ చేసి ఉండాలి. అలాగే ఫిజియోథెరపీలో కనీసం 10 సంవత్సరాల అనుభవం కూడా అవసరం అని బీసీసీఐ నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తు చేసే ఫిజియోకు ఏదైనా జట్టు లేదా అథ్లెట్‌తో పనిచేసిన అనుభవం కూడా ఉండాలి అని చెప్పింది.
కండిషనింగ్ కోచ్ బాధ్యతలు -
స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆటగాళ్ల కోసం వార్మ్‌అప్ షెడ్యూల్ చేస్తారు. అలాగే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేయిస్తారు. వారు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కూడా చూసుకుంటారు. దీని కోసం ప్రత్యేక ప్రోగ్రామ్‌లను రూపొందించే బాధ్యత ఉంటుంది. ఈ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 7 సంవత్సరాల అనుభవం అవసరం ఉంటుందని బీసీసీఐ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అలాగే ఏదైనా జట్టు లేదా అథ్లెట్‌తో పనిచేసిన అనుభవం కూడా ఉండాలి.
Job Application 🚨
— BCCI Women (@BCCIWomen) April 16, 2025
BCCI invites applications for
1) Head Physiotherapist and
2) S&C Coach at Centre of Excellence / #TeamIndia (Senior Women)
Details 🔽 https://t.co/2je2YVco7K
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఉన్న అనుభవం బట్టి జీతం ఇస్తారు. సాధారణంగా ఫిజియోథెరపిస్టులకు పది నుంచి 50 లక్షల వరకు జీతం ఉంటే ఛాన్స్ ఉంది. పురుషుల జట్టులో పని చేసేవాళ్లకు కోట్లలో ఇస్తారు. మహిళా జట్టుతో పని చేసే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌కు కూడా పది నుంచి 30 లక్షల వరకు ఇస్తారని తెలుస్తోంది. పురుషుల జట్టు నుంచి లాభాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ పని చేసే స్టాఫ్‌కు ఎక్కువ జీతాలు చెల్లిస్తారు. మహిళా క్రికెట్ జట్టు ఇప్పుడిప్పుడో వృద్ధిలోకి వస్తున్నందున జీతాలు చెల్లింపు కూడా యావరేజ్‌గా ఉంటుంది. ఈ జీతాల గురించి మాత్రం తన నోటిఫికేషన్‌లో ఎలాంటి వివరాలు బీసీసీఐ ఇవ్వలేదు.




















