Rasi Phalalu Today 16th April 2025: ఈ రాశివారి జీవితంలో ఆసక్తికర సంఘటనలు జరుగుతాయి - మేషం to మీనం ఏప్రిల్ 16 రాశిఫలితాలు
Rasi Phalalu Today in Telugu 16th April 2025 : మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య తదితర రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

ఏప్రిల్ 16 రాశిఫలం
మేష రాశి
మేష రాశి వారు ఈరోజు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పని ప్రదేశంతో పాటు ఇంటి పనులను చక్కబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. ఆర్థిక లాభం ఉంటుంది...కానీ వెంటనే ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. అలసటగా అనిపించవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడతారు. ఎవరి ప్రలోభాలకు లోనుకావొద్దు.
వృషభ రాశి
ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి...అవి మిమ్మల్ని సంతోషపరుస్తాయి. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఊహించని వార్త విని ఆశ్చర్యపోతారు. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి లాభం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత చాలా పనులు అసంపూర్తిగా ఉంటాయి. ఇంటి వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కుతుంది.. మాటలపై నియంత్రణను కలిగి ఉండటం చాలా అవసరం.
మిథున రాశి
ఈ రోజు ఆరంభం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. కానీ మీరు గందరగోళం, మానసిక ద్వంద్వం నుంచి బయటపడేందుకు ప్రయత్నించకపోతే నష్టపోతారు. వ్యాపారంలో పురోగతితో సంతోషిస్తారు. మధ్యాహ్నం తర్వాత సమయం కొంత విశ్రాంతిగా ఉంటుంది. తొందరపడి తీసుకున్న ఏదైనా తప్పు నిర్ణయానికి తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులు ఏదో ఒక అంశంపై ఆందోళన చెందుతారు.
కర్కాటక రాశి
రోజు ప్రారంభం అనిశ్చితి కారణంగా ప్రభావితమవుతుంది..సోమరితనంగా ఉంటారు. ఏం చేయాలనుకుంటున్నారో వాతావరణం దానికి విరుద్ధంగా అనిపిస్తుంది కానీ ఓపికగా ఉండండి. మధ్యాహ్నం తర్వాత సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒక ప్రత్యేక వ్యక్తి నుంచి ముఖ్యమైన సహాయం లభించవచ్చు. దాని కారణంగా భవిష్యత్తులో కూడా లాభదాయకంగా ఉంటుంది. విద్యారంగంలో కర్కాటక రాశి వారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండవచ్చు.
సింహ రాశి
ఈ రోజు మీరు ఓపికగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కోపం తగ్గించుకోవడం మంచిది. ఇంట్లో గందరగోళం కారణంగా మీపై ఒత్తిడి ఉంటుంది. రోజు ప్రారంభంలో కుటుంబ సభ్యులతో గొడవ జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు ఏదో ఒక కారణంతో అసంతృప్తిగా ఉంటారు. పని ప్రదేశంలో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది మరియు సహోద్యోగులు లేదా అధికారులు మిమ్మల్ని తప్పుపడతారు. డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి సమయం పడుతుంది.
కన్యా రాశి
ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఎంత కష్టపడినా ఆ ఫలితం ఇప్పుడు పొందలేదు. పనిచేసే ప్రదేశంలో చాలా సంయమనంతో వ్యవహరించాలి, లేకపోతే మీ చిన్న తప్పు మీకు ఇబ్బంది కలిగిస్తుంది. లాభం స్థానంలో నష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. వ్యాపారం అంచనాల కంటే తక్కువగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అభిప్రాయ బేధాలు రావొచ్చు.
తులా రాశి
మీరు మీ పని పట్ల నిర్లక్ష్యం చూపిస్తారు కానీ అదృష్టం మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది. మీ అంచనాల కన్నా రెట్టింపు లాభం పొందుతారు. వాస్తవికతను వదిలి కల్పిత ప్రపంచంలో ఉండకండి. కళారంగంతో సంబంధం ఉన్న వారు మంచి అవకాశాలు అందుకుంటారు. ఫ్యాషన్ రంగంతో సంబంధం ఉన్న వారికి కూడా రోజు మంచిది. మీ భావోద్వేగాలపై నియంత్రణను కలిగి ఉండండి . రెండు రకాల ఆలోచనల్లో ఉండొద్దు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ మాటలపై సంయమనం కలిగి ఉండండి. ముఖ్యమైన పనులను మధ్యాహ్నం కన్నా ముందే పూర్తిచేయండి. ప్రభుత్వ రంగంలో పనులు రేపు పూర్తవుతాయి. వ్యాపారంలో మీ సంపాదన బావుంటుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో స్నేహితుల నుంచి పూర్తి సహాయం లభిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాన్ని తీసుకోవద్దు...నష్టపోతారు. మీ రోజువారీ జీవితం అస్తవ్యస్తంగా అనిపిస్తుంది. మనసులో ప్రతికూల భావాలు వస్తాయి. మీపని పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులు మీకు సరైన సలహా ఇస్తారు కానీ వారు మీకు తప్పుగా అనిపిస్తారు దీని వల్ల నష్టం జరుగుతుంది. సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడుతుంది. పాత వ్యాధులు మళ్ళీ వస్తాయి.
మకర రాశి
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు మాత్రం వెంటాడుతాయి. సమయానికి పని పూర్తి చేసిన తర్వాత కూడా మీకు అనుకున్న విజయం లభించలేదనిపిస్తుంది. పెద్దల సహకారంతో కొంత గందరగోళం తొలగిపోతుంది. సామాజిక కార్యక్రమాలకు సమయం కేటాయించాలి. మీకు ఇష్టం లేకపోయినా కుటుంబం లేదా బంధువులతో సమయం గడపాలి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.
కుంభ రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. రోజంతా మానసిక ఆందోళన ఉంటుంది. ఏదో ఒక కారణంతో వ్యాపారంలో డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ముందుకు సాగలేవు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా సామాజిక కార్యక్రమంలో కూడా మీరు రేపు పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వ రంగంలో ఉండేవారికి చికాకులు తప్పవు.
మీన రాశి
ఈ రోజు ఆరంభం మీకు గందరగోళంగా ఉంటుంది. ఫలితంగా నిత్యం చేసేపనులు కూడా ఆలస్యం అవుతాయి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడం వల్ల నిరాశగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ కొంత ప్రశాంతత పొందుతారు. సాయంత్రానికి ఓ శుభవార్త మీలో సంతోషం నింపుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















