Stock Market: షేర్ మార్కెట్ ఏ నెలలో పెరుగుతుంది , ఏ నెలలో డౌన్ అవుతుంది - పెట్టుబడులు పెట్టడం సేఫేనా!
Stock Market Updates: షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన షేర్స్ లాభాల్లో ఉన్నాయా నష్టాల్లో ఉన్నాయా? రానున్న నెలల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అడుగు ముందుకు వేయొచ్చా?

Is Now a Good Time to Invest: ఫిబ్రవరి, మార్చిలో షేర్ మార్కెట్ భారీగా పతనమై ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మరి ఈ ఏడాది చివరి వరకూ ఏ నెలలో షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది? పెట్టుబడులు పెట్టడం సేఫేనా?
రెండు నెలలుగా ఊహించని విధంగా డౌన్ అయిన షేర్ మార్కెట్
ట్రంప్ ప్రకటన తర్వాత ఏప్రిల్ సెకెండ్ వీక్ లో కాస్త పుంజుకున్న షేర్ మార్కెట్
ఇలాంటి సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా?
ఎలాంటి షేర్స్ తీసుకుంటే మంచిది? ఏ నెలలో షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది?
ఏప్రిల్ 2025 (చైత్రమాసం)
ఏప్రిల్ నెలలో షేర్ మార్కెట్ వృద్ధిలో ఉంటుంది. మార్చితో పోల్చుకుంటే ఈ నెలలో అన్ని షేర్లు పెరుగుతాయి. ముఖ్యంగా పెద్ద కంపెనీల షేర్లు వృద్ధి చెందుతాయి
మే 2025 (వైశాఖమాసం)
మే నెలలో షేర్ మార్కెట్లో ఒడిదొడుకులు ఉంటాయి. మొదటి రెండు వారాలు పర్వాలేదనిపించినా మూడు, నాలుగు వారాలు అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది
జూన్ 2025 (జ్యేష్టమాసం)
జూన్ నెలలో షేర్ మార్కెట్ పెరుగుదల ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ నెలలో నాలుగు వారాలు మార్కెట్ హై లోనే ఉంటుంది. అంటే ఇప్పటికే షేర్స్ కొని నష్టాల్లో ఉన్నవారు అప్పటివరకూ ఆగితే కొంత సేఫ్ అని చెప్పుకోవచ్చు.
జూలై 2025 (ఆషాఢమాసం)
జూలై నెలలో షేర్ మార్కెట్ మొదటి రెండు వారాలు ఆశాజనకంగా ఉండదు. 3, 4 వారములు షేర్ల ధరలు పెరుగుతాయి. ఆలోచించి పెట్టుబడులు పెట్టండి
ఆగష్టు 2025 (శ్రావణమాసం)
ఆగష్టు నెలలో షేర్ మార్కెట్ మొదటి రెండు వారాలు ఒడిదొడుకులు ఉన్నప్పటికీ మంత్ సెకెండాఫ్ బావుంటుంది. షేర్ల ధరలు పెరుగుతాయి
సెప్టెంబర్ 2025 (భాద్రపదమాసం)
ఈ నెలలో మొత్తం నాలుగు వారాలు షేర్ మార్కెట్ బావుంటుంది. షేర్ల ధరలు పెరగడమే కానీ తగ్గడం ఉండదు
అక్టోబర్ 2025 ( ఆశ్వయుజమాసం)
అక్టోబర్ నెలలో షేర్ మార్కెట్ నాలుగు వారాలు అద్భుతంగా ఉంటుంది. గతంలో పెట్టిన షేర్లు ఏమైనా ఉంటే ఈ నెలలో మంచి లాభాలు ఆర్జిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్, పెట్రోలియం, రియల్టర్స్, స్టీలుకం పెనీల షేర్లు పెరుగుతాయి.
నవంబర్ 2025 (కార్తీకమాసం)
నవంబర్ నెలలో షేర్ మార్కెట్ మొదటి రెండువారాలు మందగిస్తుంది కానీ తర్వాత రెండు వారాలు విశేషంగా పెరుగుతుంది. ఈ సమయంలో చిన్న కంపెనీలు కూడా లాభపడతాయి
డిసెంబర్ 2025 ( మార్గశిరమాసం)
ఇయర్ ఎండ్ డిసెంబర్లో షేర్ మార్కెట్లో జోష్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ నెలలో ప్రతి షేర్ ధర పెరుగుతుంది
జనవరి 2026 ( పుష్యమాసం)
నూతన సంవత్సరం జవరి 2026 ఆరంభంలో షేర్ మార్కెట్ డౌన్ లో ఉంటుంది కానీ సంక్రాంతి తర్వాత విజృంభిస్తుంది.
ఫిబ్రవరి 2026 (మాఘమాసం)
షేర్ మార్కెట్ ఫిబ్రవరి నెల ఆరంభంలో ఒడిదొడుకులు ఉంటుంది...సెకెండాఫ్ లో ఊపందుకుంటుంది
మార్చి 2026 (ఫాల్గుణమాసం)
మార్చి 2026 లో మార్కెట్ ఒడిదొడుకులు ఉన్నప్పటికీ పెద్దకంపెనీ షేర్లు, రియల్టర్స్ షేర్స్, బ్యాకింగ్ షేర్లు, పెట్రోలియం, నిర్మాణరంగం షేర్లు బాగా పెరుగుతాయి.
గమనిక: గ్రహాల సంచారం ఆధారంగా పండితులు పేర్కొన్న వివరాలివి. ఏబీపీ దేశం వీటిని ధృవీకరించడం లేదు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకునేముందు ఆయా రంగంలో నిపుణులను సంప్రదించిన తర్వాతే పెట్టుబడులు పెట్టండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

