CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP Desam
జనరల్ గా చెన్నైలో ఆర్సీబీకి, సీఎస్కేకి మ్యాచ్ అంటే ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయిపోతారు విజయం చెన్నైదే అని. ఎందుకంటే అదేదో ఒక్కసారి కాదు గడచిన 17ఏళ్లుగా చెపాక్ లో ఆర్సీబీ, చెన్నై తలపడినప్పుడల్లా చెన్నైదే విజయం. ఆఖరి సారి 2008లో ఆర్సీబీ చెన్నైపై చెన్నైలో గెలిచింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అక్షరాలా 6155 రోజుల తర్వాత ఆ చెత్త రికార్డును బ్రేక్ చేసింది ఆర్సీబీ. సొంతగడ్డపై బాహుబలి లాంటి చెన్నైని 50పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ కొట్టేసిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. కెప్టెన్ లక్కీ పాటిదార్
ఆర్సీబీ ప్రారంభం మంచిగానే ఉన్నా ఎక్కడో తడబాటు. వరుస విరామాల్లో వికెట్లు పడుతూ ఉన్నాయి కానీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. వికెట్లు పడతాయనే భయమే లేకుండా ప్రతీ బాల్ హిట్ చేశాడు. ఎంత లక్కీ అంటే రజత్ పాటిదార్ ఇచ్చిన మూడు క్యాచ్ లను చెన్నై ఫీల్డర్లు వదిలేశారు. ఫలితంగా 32 బాల్స్ లో 4ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు రజత్ పాటిదార్. బెంగుళూరు సైడ్ నుంచి ఈ మ్యాచ్ లో ఈ రోజు నమోదైన ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఇది.
2. టిమ్ డేవిడ్ ఫినిషింగ్
ఫిల్ సాల్ట్, కొహ్లీ, పడిక్కల్ అంతా 25+ పరుగులు కొట్టి అవుటైపోయినా చివర్లో టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ ముగించిన విధానం మాత్రం ఆర్సీబీ కి భారీ స్కోరు తెచ్చి పెట్టింది. కేవలం 8 బాల్స్ ఎదుర్కొని 3 సిక్సర్లు 1 ఫోర్ తో 22 పరుగులు చేశాడు టిమ్ డేవిడ్. ఫలితంగా ఆర్సీబీ 196పరుగుల భారీ స్కోరు చేసి చెన్నైకి 197 టార్గెట్ ఇచ్చింది.
3. నూర్ అహ్మద్ మ్యాజిక్
మ్యాచ్ చెన్నై ఓడినా నూర్ అహ్మద్ మాత్రం తన బౌలింగ్ తో ఆర్సీబీని బాగానే ఇబ్బంది పెట్టాడు. ఏబ్యాటరూ కుదురుకోకుండా తన ఓవర్ వచ్చినప్పుడ ల్లా ఓ వికెట్ తీశాడు నూర్ అహ్మద్. ధోని మెరుపు స్టంపింగ్ చేయటం ద్వారా ఫిల్ సాల్ట్ ను, 31 పరుగులు చేసిన విరాట్ కొహ్లీని, ప్రమాదకర లివింగ్ స్టన్ ను అవుట్ చేశాడు. 4 ఓవర్లలో 36పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి ఇంప్రెస్ చేశాడు ఆఫ్గాన్ యువ సంచలనం
4. రచిన్ మినహా బ్యాట్లెలెత్తేసిన చెన్నై
చెన్నై ఛేజింగ్ ఎంత బోరింగ్ అంటే అంత బోరింగ్ 8 పరుగులకే రాహుల్ త్రిపాఠీ, రుతురాజ్ గైక్వాడ్ అవుటైపోవటంతో చెన్నై ఈ మ్యాచ్ ను ఎలా ఆడనుందో అర్థమైపోయింది అందరికీ. కేవలం రచిన్ రవీంద్ర మాత్రమే 31 బాల్స్ లో 5ఫోర్లతో 41 పరుగులు చేశాడు కానీ మిగిలిన అంతా ఇలా రావటం అలా పోవటం అంతే. పోతే పోయారు టెస్టు మ్యాచ్ లాగా జిడ్డు బ్యాటింగ్ చేశారు. చివర్లో జడ్డూ, ధోని కాస్త మెరుపులు మెరిపించినా అప్పటికే వాళ్లతో సహా అంతా జరగాల్సిన జాప్యం అంతా చేసి మ్యాచ్ ను ఆర్సీబీ చేతుల్లో పెట్టేశారు. ధోనీ రెండు సిక్సులు, మూడు ఫోర్లు బాది కాసేపు ఎంటర్ టైన్ చేయటమే సీఎస్కే ఫ్యాన్స్ కి మిగిలిన ఆనందం.
5. ఆర్సీబీ సమష్ఠి బౌలింగ్
ఈ మ్యాచ్ లో అందరూ తేలిగ్గా తీసుకున్నా ఆర్సీబీ బౌలర్లు మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. జోష్ హేజిల్ వుడ్, లెజెండ్ భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, లివింగ్ స్టన్ ..చెన్నై దుమ్ము దులిపి వదిలిపెట్టారు. హేజిల్ వుడ్ స్టార్టింగ్ లోనే త్రిపాఠీ, గైక్వాడ్, చివర్లో జడ్డూను అవుట్ చేసి మూడు వికెట్లు తీస్తే చేస్తే... యశ్ దయాల్.... రచిన్ రవీంద్ర, శివమ్ దూబేలను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా చెన్నై ను 8వికెట్ల నష్టానికి 146పరుగులకే మాత్రమే పరిమితం చేసి ఏకంగా 17 ఏళ్ల తర్వాత చెన్నైలో చెన్నైని ఆర్సీబీ మట్టి కరిపించింది.





















