Myanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP Desam
పెద్ద పెద్ద భవంతులు ఉన్నపళంగా కూలిపోయాయి. పదుల అంతస్థుల భవనాలపైన ఉన్న స్మిమ్మింగ్స్ పూల్స్ లోని వాటర్ అంత ఊగి కిందకుపడిపోయింది. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. రోడ్లన్నీ కదిలిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. ఈ విధ్వంసం అంతా జరిగింది మయన్మార్, బ్యాంకాక్ లలో. ఈ రెండు దేశాల్లో భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపాల కారణంగా వందలాదిగా భవనాలు అమాంతం కుప్పకూలిపోయాయి. ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఆర్తనాదాలు చేశారు. సెంట్రల్ మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రంగా గుర్తించారు. ఈ ప్రకృతి విధ్వంసంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు...ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా తెలియ రావటం లేదు. భారీగా నష్టం వాటిల్లి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు శిథిలాలు తొలగిస్తే కానీ తెలిసే అవకాశం లేదు.





















