Trump Next Cuba: ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ క్యూబా - ఇరాన్ పని పూర్తి కాగానే అటు వార్ - ఇంతకీ ఆ దేశంతో గొడవేంటి?
Regime change in Cuba: క్యూబాలోనూ పాలన మార్చాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఇరాన్ తో యుద్ధం పూర్తయ్యాక.. క్యూబాతో ప్రారంభిస్తామని ప్రకటించారు.

Cuba Trump is coming, get ready : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత, క్యూబాను టార్గెట్ చేస్తామన్నారు. వైట్ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, క్యూబా విషయంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఇరాన్ పని పూర్తయ్యాక తమ తదుపరి లక్ష్యం క్యూబానే అనే సంకేతాలను ఆయన బలంగా పంపారు. క్యూబాపై తాము విధిస్తున్న ఆంక్షలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మనం ఇరాన్ పనిని పూర్తి చేయాలనుకుంటున్నాం.. అది అయిపోయాక క్యూబా వంతు వస్తుంది, అది కేవలం సమయం పట్టే విషయం మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడిని బంధించడం, లాటిన్ అమెరికాలో సైనిక చర్యలకు దిగడం ద్వారా ట్రంప్ తన ఉద్దేశాలను స్పష్టం చేశారు.
BREAKING: Trump says that America will go to war with Cuba next after the war in Iran is “finished.”
— Really American 🇺🇸 (@ReallyAmerican1) March 6, 2026
Trump is addicted to regime change. pic.twitter.com/XqMr8CjmaI
క్యూబా-అమెరికాకు దీర్ఘకాల శత్రుత్వం
క్యూబా, అమెరికా మధ్య గొడవ ఇప్పటిది కాదు, ఇది దశాబ్దాల చరిత్ర కలిగిన కోల్డ్ వార్ రెండు దేశాల మధ్య ఉంది. 1959లో ఫిడెల్ కాస్ట్రో నేతృత్వంలో క్యూబాలో కమ్యూనిస్ట్ విప్లవం వచ్చినప్పటి నుండి అమెరికా ఆ దేశాన్ని తన శత్రువుగా పరిగణిస్తోంది. అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలోనే ఒక కమ్యూనిస్ట్ దేశం ఉండటం, అది అప్పటి సోవియట్ యూనియన్ మద్దతుగా నిలవడాన్ని అమెరికా ఏనాడూ సహించలేదు. 1962 నాటి క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ ప్రపంచాన్ని అప్పట్లో అణుయుద్ధం అంచున నిలబెట్టింది.
ఆర్థిక ఆంక్షలు , దిగ్బంధం
క్యూబాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా దశాబ్దాలుగా వాణిజ్య దిగ్బంధం చేసింది. ట్రంప్ తన రెండో విడత పాలనలో ఈ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ముఖ్యంగా వెనిజులా నుండి క్యూబాకు వచ్చే చమురు సరఫరాను అడ్డుకోవడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల క్యూబాలో ప్రస్తుతం తీవ్రమైన విద్యుత్ కోతలు, ఇంధన కొరత, ఆహార సంక్షోభం నెలకొన్నాయి.
ఇరాన్ లింక్ , ప్రాంతీయ రాజకీయాలు
ఇరాన్, క్యూబా రెండు దేశాలు కూడా అమెరికా వ్యతిరేక దేశాలుగా ముద్రపడ్డాయి. ఇరాన్‌పై మిడ్‌నైట్ హామర్ వంటి సైనిక చర్యల ద్వారా విజయం సాధిస్తున్నామని నమ్ముతున్న ట్రంప్, అదే వ్యూహాన్ని లాటిన్ అమెరికాలో కూడా అమలు చేయాలని చూస్తున్నారు. క్యూబాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కూల్చివేసి, అక్కడ తమకు అనుకూలమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని స్థాపించడమే ట్రంప్ , మార్కో రూబియోల ప్రధాన లక్ష్యమని స్పష్టమవుతోంది.
ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఇప్పటికే క్యూబాపై ఆంక్షల వల్ల మానవీయ సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించింది. క్యూబా ప్రభుత్వం దీనిని సామూహిక శిక్ష గా అభివర్ణిస్తోంది. అంతర్జాతీయ చట్టాలను లెక్కచేయకుండా సైనిక శక్తిని ఉపయోగించి ఇతర దేశాల్లో ప్రభుత్వాలను మార్చాలని చూడటం వల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు లేవు
ట్రెండింగ్ వార్తలు



















