Kalavari Kodalu Kanaka Mahalakshmi serial Today: విహారి, లక్ష్మీలను కంపెనీలకు దూరం చేయాలని అంబిక కుట్ర! ప్లాన్ సక్సెస్ అవుతుందా!
kalavari kodalu kanaka mahalakshmi serial today march 6th అంబిక బోర్డు మీటింగ్ పెట్టి ఛైర్మన్‌గా విహారి కరెక్ట్ కాదని అందరికీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi serial today episode | పద్మాక్షి ఇంట్లో అందరితో అందరూ సహస్ర గురించి మాత్రమే ఆలోచించాలి కాదని ఆ పని మనిషి లక్ష్మీ గురించి ఎవరైనా ఆలోచిస్తే నేను పాత పద్మాక్షిలా మారాల్సి వస్తుంది అని పద్మాక్షి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు లక్ష్మీ పోలీస్ స్టేషన్‌లో ఏడుస్తూ తను ప్రెగ్నెంట్ అని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది.
లక్ష్మీ ఏడుస్తుంటే చూసిన కానిస్టేబుల్ లక్ష్మీ ఏం తినడం లేదని తన బాక్స్ ఇచ్చి తినమని చెప్తుంది. లక్ష్మీ వద్దని అంటే కడుపుతో ఉన్నావ్ తినమని ఎస్‌ఐ లేదని చెప్పి ఇస్తుంది. లక్ష్మీ బాక్స్ తీసుకొని తింటుంది. లక్ష్మీ కడుపు మీద చేయి వేసుకొని సంతోషంగా బిడ్డతో మాట్లాడుతుంది. నీ కోసం ఎంత కష్టం అయినా భరిస్తా.. నిన్ను కాపాడుకోవడానికి ఎన్నిఅయినా ఎదుర్కొంటాను.. నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయడమే నా లక్ష్యం. నువ్వు ఓ నష్టజాతకురాలి కడుపులో పుట్టావ్. నీకు మంచి భవిష్యత్ ఇస్తాను కానీ నాలాంటి జీవితం నీకు ఇవ్వను.. నువ్వు పుట్టేలోపు నీ కోసం బంగారు బాట వేస్తాను అని సంతోషంగా మాట్లాడుతుంది. లక్ష్మీ తినేసి పడుకుంటుంది. అప్పుడే ఎస్‌ఐ వచ్చి చూస్తుంది.
విహారి లక్ష్మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మీకి ఇలాంటి పరిస్థితిలో ఏం చేయలేకపోతున్నా.. అసలు లక్ష్మీ మీద ఇంత పెద్ద నింద వేసింది ఎవరు.. మీడియాలో ఇదంతా రావడానికి కారణం ఎవరో కనిపెడతా అందరి సంగతి తేల్చుతా అని అనుకుంటాడు. ఇక లక్ష్మీ చూపించుకున్న డాక్టర్ లక్ష్మీ వాళ్లకి ఫోన్ చేసి లక్ష్మీ ప్రెగ్నెన్సీ గురించి చెప్పమని అంటుంది. మరోవైపు వీర్రాజు, పానకాలు ముష్టివాళ్ల గెటప్‌లు తీసేసి పట్టు పంచె, పని వాడిలా మారిపోతాడు. వీర్రాజు దగ్గర ఫోన్ మోగితే ఎవరిదో అనుకుంటాడు. ఇంతలో ఆ ఫోన్ లక్ష్మీది అని గుర్తించి లిఫ్ట్ చేస్తాడు. అప్పుడే నర్స్ కాల్ చేసి లక్ష్మీ గారు ఎక్కడ అని అనగానే వీర్రాజు ఫోన్ కట్ట చేసేస్తాడు.
అంబిక ఆఫీస్‌లో బోర్డు మీటింగ్ పెడుతుంది. లక్ష్మీ గురించి వచ్చిన న్యూస్ చూపించి ఇది మన విహారి కంపెనీలకు చెందిన పరువు మర్యాద గురించి అని అంటుంది. అందరూ వీడియో చూసి లక్ష్మీని పోలీసులు తీసుకెళ్లడం చూసి బిత్తరపోతారు. లక్ష్మీని సీఈఓ చేశారు తన వల్ల పరువు పోయిందని అంబిక అంటే ఈ ఒక్క ఘటనతో మన కంపెనీ స్థాయి తగ్గిపోయింది అని చెప్తుంది. అందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మీ సీఈఓగా ఉండటం కరెక్ట్ కాదు అని అంబిక ఎక్కిస్తుంది. విహారి కూడా ఇక కంపెనీకి రాడు అనిపిస్తుందని అంటుంది. విహారి మీ మేనల్లుడే కదా అని అందరూ అంటే నా మేనల్లుడే అయినా సరే నాకు కంపెనీ ముఖ్యం.. మళ్లీ మీటింగ్ పెట్టేలోపు ఆలోచించండి విహారినే ఛైర్మన్‌గా కావాలా కొత్త ఛైర్మన్ కావాలా అని ఆలోచించండి అని అంటుంది.
విహారి లక్ష్మీ గురించి ఆలోచిస్తూ అప్పుడే బయటకు వెళ్తాడు. ఇంతలో లక్ష్మీ కోసం ఓ పోస్ట్ ఇంటికి వస్తుంది. వాటిని పండు తీసుకుంటాడు. అంబిక అప్పుడే ఫైల్స్‌తో రావడం పండు అంబిక ఒకర్ని ఒకరు ఢీ కొట్టుకోవడంతో లక్ష్మీకి చెందిన పేపర్లు కూడా కింద పడిపోతాయి..అంబిక పేపర్లతో పాటు పండు లక్ష్మీకి చెందిన పేపర్ కూడా అంబిక ఫైల్‌లో పెట్టి ఇచ్చేస్తాడు. అంబిక వాటిని తన గదిలో పెట్టేస్తుంది. ఇక విహారి లాయర్‌కి కాల్ చేసి మాట్లాడుతాడు. లక్ష్మీ ఎలాంటి తప్పు చేయలేదు అని కోర్టులో నిరూపించాలి.. వ్యభిచారం నిర్వహిస్తున్న వాళ్లు కూడా ఎవరో తెలిస్తే విషయం బయటకు వస్తుందని విహారి లాయర్‌తో మాట్లాడుతాడు. అంబిక మొత్తం వింటుంది. సహస్ర, అంబికల్ని అడ్డు పెట్టుకొని విహారి కోర్టుకి రాకుండా చేయాలి అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు



















