SRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam
నిన్న కాటేరమ్మ కొడుకులకు ఊహించని షాక్. అస్సలు మా వాళ్లు ఈరోజు 300 ఈజీగా కొట్టేస్తారు అని ఫిక్స్ అయిపోయిన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కు అయితే నోటెమ్మెట మాట లేదు. రీజన్ ఎవ్వరూ ఊహించని విధంగా సన్ రైజర్స్ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. అంతకు ముందు వైజాగ్ లో భారీ స్కోర్ చేసినా అశుతోష్ శర్మ చితక్కొట్టేయటంతో ఢిల్లీలో చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన లక్నో...ఎలాంటి అంచనాలు లేకుండా హైదరాబాద్ లో హైదరాబాద్ మీద బరిలోకి దిగి ఆరెంజ్ ఆర్మీకి ఊహించని షాక్ ఇచ్చింది. అయితే ఈ ఓటమికి లక్నో ఆట తీరుకు ఎంత క్రెడిట్ ఇవ్వాలో సన్ రైజర్స్ ఆలోచనా తీరును కూడా అంతే ఆత్మ విమర్శ చేసుకోవాలి. అసలు సన్ రైజర్స్ లక్ష్యం ఏంటీ ఐపీఎల్ ట్రోఫీ గెలవటం. కానీ జరుగుతున్న ప్రచారం అంతా ఏంటీ 300 కొడతారా కొట్టరా అని. నిన్న మ్యాచే ఉదాహరణ. లక్నోను 2024 లో వికెట్ కూడా పోకుండా 9ఓవర్లలోనే 160 ఛేజింగ్ లో కొట్టాం. సో ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ కానీ పడితే సన్ రైజర్స్ బ్యాటర్లైన అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఉన్న ఫామ్ కి ఈజీగా 300 స్కోరు కొడతాం. సో తొలిసారి ఆ ఫీట్ ను సాధించిన ఐపీఎల్ జట్టుగా చరిత్రలో నిలిచిపోతాం అనే హడావిడి జరిగింది. దీన్నే హైప్ ఎక్కించుకోవటం అంటారు. మీడియా దగ్గరపెడితే ఆఖరకు సన్ రైజర్స్ సోషల్ మీడియా వరకూ అందరూ 300 గురించే మాట్లాడుకుంటే ఆటగాళ్లలో తెలియకుండా ఇన్ బిల్డ్ ప్రెజర్ పెరుగుతుంది. ఎంత ధైర్యవంతులైన అరివీర భయంకర బ్యాటర్లైనా లక్ష్యం మ్యాచ్ గెలవటం దగ్గర నుంచి 300 కొట్టడం వైపు మళ్లుతుంది. అదే కనిపించింది నిన్న కూడా. అసలు ఏ మాత్రం అంచనాలు లేని లక్నో మీద ఎలాంటి ప్రెజర్ ఉండదు కాబట్టి వాళ్లు ఏమన్నా రిస్క్ తీసుకుని లూజ్ బాల్స్ వేసి ఊరిస్తారేమో అని కూడా ఆలోచించకుండా సిద్ధమైపోయింది సన్ రైజర్స్ . కానీ శార్దూల్ నకుల్ అండ్ స్లో బాల్స్ తో తెగ ఇబ్బంది పెట్టాడు. ప్రిన్స్ యాదవ్ ప్రాణం పెట్టి బౌలింగ్ వేశాడు. ఫలితంగా సన్ రైజర్స్ ఊహించని విధంగా టాప్ 5 వికెట్లు కోల్పోయింది. హెడ్ కాస్త ఆడాడు..అనికేత్, కమిన్స్ సిక్సులు కొట్టారు కాబట్టి 190 అయినా కొట్టారు కానీ లేదంటే ఇంకా తక్కువకే అయిపోయేవారు అనిపించింది. ఏ టీమ్ అయినా నాణ్యమైన టీమ్ గానే పరిగణించి బౌలర్లను ఆచి తూచి ఆడటం..మంచి బంతులను రెస్పెక్ట్ చేస్తూ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ రూటెడ్ గా ఆడదాం లాంటి క్రికెట్ బేసిక్ రూల్స్ ను మర్చిపోతే సన్ రైజర్స్ కు ఇలాంటి షాక్ లు తగలటం రిపీట్ కావొచ్చు. హైప్ తగ్గించుకోండి.రూటెట్ గా ఆడండి.





















