DC vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై సూపర్ ఓవర్ లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP Desam
ముంబై ఇండియన్స్ మీద ఏదో వరుస రనౌట్స్ అయ్యి మ్యాచ్ ఓడిపోయింది కానీ మళ్లీ DC విన్నింగ్ స్ట్రీక్ మొదలుపెట్టడం పక్కా అని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ అంతా భావించినా అదంత సులభంగా జరగలేదు. రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీకి వాళ్ల సొంతగడ్డపైనే గట్టి షాక్ ఇచ్చేలా చివరి వరకూ పోరాడింది. ఓ దశలో రాజస్థాన్... ఢిల్లీపై మ్యాచ్ గెలిచేసింది అనుకున్నారు కానీ ఆఖరి ఓవర్ ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేయటంతో మ్యాచ్ టై అయ్యి నాలుగేళ్ల తర్వాత తొలిసారి సూపర్ ఓవర్ జరిగిన ఈ మ్యాచ్ లో ఆఖరకు విజయం..ఢిల్లీనే వరించింది. మరి ఈ థ్రిల్లర్ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. అభిషేక్ పోరల్ పోరాటం
ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణయం తప్పా అనిపించేలా ఢిల్లీ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు ఓపెనర్ అభిషేక్ పోరల్. ప్రధానంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌలింగ్ వేసిన తుషార్ దేశ్ పాండే నైతే ఊతకొట్టుడు కొట్టాడు. ఫోర్, ఫోర్, సిక్స్, ఫోర్, ఫోర్ కొట్టి లాస్ట్ బంతికి సింగిల్ తీసుకుని తుషార్ కి చుక్కలు చూపించాడు పోరల్. ఆ ఓవర్ లో మొత్తం 23 పరుగులు లాగేశాడు. తను ఆడిన మొదటి ఏడు బంతుల్లోనే 23పరుగులు చేసిన పోరల్..తర్వాత పవర్ ప్లేలో టపా టపా రెండు వికెట్లు పడిపోవటంతో దూకుడు తగ్గించాల్సి వచ్చింది. ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న JFM ఆర్చర్ బౌలింగ్ లో..లాస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రెచ్చిపోయిన కరుణ్ నాయర్ సున్నా పరుగులకే రనౌట్ కావటంతో ఇన్నింగ్స్ స్లో డౌన్ అయ్యింది.
2. మిడిల్ నిలబెట్టింది
ఓ దశలో పరుగులు బాగా తగ్గిపోయి 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేసిన ఢిల్లీ...188 పరుగులు చేయగలిగిందంటే రీజన్ ఢిల్లీ మిడిల్ ఆర్డర్. కేఎల్ రాహుల్ స్లోగా ఆడినా చేసిన 38 పరుగులు, స్టబ్స్ 34, కెప్టెన్ అక్సర్ పటేల్ 34 పరుగులు చేయటంతో ఢిల్లీ 188 పరుగులు చేసి రాజస్థాన్ కు 189 టార్గెట్ ఇవ్వగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా 2 వికెట్లు తీసుకోవటం మినహాయించి మిగిలిన వారు అంతగా ఆకట్టుకోలేకపోయారు.
3. జైశ్వాల్, సంజూ షో
189 టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ కు స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్టనర్ షిప్ పెట్టారు జైశ్వాల్ అండ్ కెప్టెన్ సంజూ శాంసన్. స్టార్క్ లాంటి లెజెండ్ ను టార్గెట్ చేసి మరీ ఆడిన జైశ్వాల్ 37 బాల్స్ లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 51పరుగులతో సూపర్ హాఫ్ సెంచరీ కొట్టాడు. మరో వైపు సంజూ 19 బాల్స్ లోనే 2 ఫోర్లు 3 సిక్సర్లతో 31 పరుగులు చేసినా రిబ్స్ పట్టేయటంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. పరాగ్ 8పరుగులే వెనుదిరగటంతో ఢిల్లీ కాస్త గేమ్ లోకి వచ్చిందా అన్న సందేహం కలిగింది.
4. రఫ్పాడించిన నితీశ్ రానా
గేమ్ లోకి వచ్చిన ఢిల్లీని మళ్లీ తిప్పలు పట్టేలా రఫ్పాడించాడు నితీశ్ రానా. 28 బాల్స్ లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 51పరుగులు చేసి గేమ్ ను డీప్ దాకా తీసుకువచ్చేశాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఎల్ డబ్ల్యూగా వెనుదిరిగినా అప్పటికే రాజస్థాన్ టార్గెట్ ఛేజ్ చేయటానికి కావాల్సిన మూమెంటమ్ ఇచ్చాడు తన జట్టుకు.
5. RR కు షాక్ ఇచ్చిన స్టార్క్
నితీశ్ రానా అవుట్ అయ్యే టైమ్ కి రాజస్థాన్ గెలవాలంటే 14 బాల్స్ లో 28 కొట్టాలి. అయితే జురెల్, హెట్మెయర్ కలిసి మిగిలిన పనిని పూర్తి చేసేస్తారు అనుకుంటే... ఆఖరి ఓవర్ లో స్టార్క్ సూపర్ బౌలింగ్ తో జస్ట్ 8 పరుగులే ఇచ్చి మ్యాచ్ ను టై చేసి పారేశాడు. ఫలితంగా 2021 తర్వాత తొలిసారి సూపర్ ఓవర్ జరిగింది ఈ మ్యాచ్ లో.
ఇక Super over డీటైల్స్ చూస్తే
సూపర్ ఓవర్ ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ తరపున హెట్మెయర్, రియాన్ పరాగ్ దిగితే..ఢిల్లీ తరపున మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేశాడు. మొదటి బంతికి మంచి యార్కర్ బాల్ వేసినా రెండో బంతికి
హెట్మెయర్ ఫోర్ కొట్టాడు. థర్డ్ బాల్ కి సింగిల్ తీసుకుంటే..ఫోర్త్ కి బాల్ ఊహించని రీతిలో స్టార్క్ నో బాల్ వేశాడు. అయితే ఫ్రీ హిట్ బాల్ ను స్టార్క్.. వైడ్ వేస్తే రన్ కి ప్రయత్నించి పరాగ్ రనౌట్ అయ్యాడు. ఐదో బంతికి డబుల్ తీసే ప్రయత్నంలో జైశ్వాల్ కూడా రనౌట్ అవ్వటంతో 11 పరుగులు మాత్రమే చేసిన రాజస్థాన్..ఢిల్లీకి 12 పరుగుల టార్గెట్ ఇచ్చింది.
ఢిల్లీ తరపున బ్యాటింగ్ చేయటానికి రాహుల్, స్టబ్స్ దిగితే..RR తరపున సందీప్ శర్మ బౌలింగ్ చేశాడు. మొదటి బంతికి రాహుల్ 2 పరుగులు చేయగా...రెండో బంతికి ఆఫ్ సైడ్ ఫోర్ కొట్టేసి ఊపు తెచ్చాడు.మూడో బంతికి సింగిల్ తీసి రాహుల్ స్టబ్స్ కి బ్యాటింగ్ ఇచ్చాడు. నాలుగో బంతిని సిక్సర్ బాదిన స్టబ్స్ ఢిల్లీకి సంచలన రీతిలో విజయాన్ని అందించాడు.
ఈ సూపర్ ఓవర్ థ్రిల్లింగ్ మ్యాచ్ లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని అధిష్ఠిస్తే.. రాజస్థాన్ మాత్రం ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు ఓడిపోయి...పాయింట్ల పట్టికలో 8వ స్థానంలోనే కొనసాగుతుంది.





















