Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Telangana: సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ పై కంచ గచ్చిబౌలిపై తప్పుడు ప్రచారం చేసినందుకు నోటీసు జారీ చేశారు. HCUలో AI చిత్రాన్ని తిరిగి పోస్ట్ చేసినందుకు స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ చేశారు

Notice to Smita Sabharwal: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఏఐ ఫోటోలను సర్క్యూలేట్ చేసిన అంశంపై పోీలసులు కేసులు నమోదు చేస్తున్నారు. వాటిని క్రియేట్ చేసిన వారే కాకుండా.. సర్క్యులేట్ చేసిన వారు ఎవరైనా సరే వదిలి పెట్టడం లేదు. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారణి స్మితా సభర్వాల్ పైనా ఫిర్యాదు రావడంతో నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మిత సభర్వాల్ కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి AI ఇమేజ్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆమె కూడా తప్పుడు ప్రచారం చేసారని.. స్మిత సభర్వాల్ పై ఫిర్యాదు అందింది.
ఓ ట్విట్టర్ హ్యాండిల్ ఫోటో రీపోస్ట్
మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే X హ్యాండిల్ లో పోస్టు చేసిన ఓ ఫోటోను స్మితా సభర్వాల్ రీపోస్టు చేశారు. UoH లోపల ఉన్న మష్రూమ్ రాక్ ముందు బుల్డోజర్‌లను, ఒక నెమలి , ఒక జింక గిబ్లి శైలిలో చూస్తున్నట్లు అందులో ఉంది. నోటీసులోని విషయాలను వెల్లడించడానికి పోలీసులు ఇష్టపడటం లేదు. అయితేAI-జనరేటెడ్ చిత్రాన్ని షేర్ చేయడం గురించి BNSS (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత) సెక్షన్ 179 కింద మేము ఆమెకు నోటీసు ఇచ్చామని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మొహమ్మద్ హబీబుల్లా ఖాన్ మీడియాకు తెలిపారు. నోటీసులోని విషయాలను వెల్లడించడానికి అధికారి నిరాకరించారు.
వివరణ తీసుకోవడానికే నోటీసులు - కేసు కాదు
ఈ ఫిర్యాదుఆధారంగా 179 BNS ప్రకారం నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసులు. ఈ సెక్షన్ సాక్షిగానే చూస్తుందని .. నిందితురాలిగా కాదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అంటే ఆమెపై ఎలాంటి కేసులు పెట్టలేదని అర్థం చేసుకోవచ్చు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై పూర్తి స్థాయిలో వివాదం రేగినప్పుడు.. చాలా మంది సెలబ్రిటీలు ఏఐ ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు తర్వాత ప్రభుత్వం కేసులు పెడుతూండటంతో.. చాలా మంది డిలీట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్మిత్ సభర్వాల్ కూడా అలాంటి పోస్టును రీపోస్టు చేయడంతో చిక్కులు వచ్చాయి. తర్వాత ఆ పోస్టును స్మితా సభర్వాల్ కూడా డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది.
మిస్ వరల్డ్ పోటీల సన్నాహాల్లో బిజీగా ఉన్న స్మితా సభర్వాల్
ఫిర్యాదు రావడంతో పోలీసులు మాత్రం నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్‌కు చెందిన పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు ప్రస్తుతం స్మితా సభర్వాల్.. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్నారు. తెలియక షేర్ చేశానని నిజం తెలిసిన తర్వాత డిలీట్ చేశానని ఆమె వివరణ ఇచ్చే చాన్స్ ఉంది. స్మితా సభర్వాల్ సమర్థమైన అధికారిణిగాపేరు తెచ్చుకున్నారు. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అనేక అంశాలపై తన స్పందనలు వ్యక్తం చేస్తూనే ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా ఆమె భయపడకుండా పోస్టులు పెడుతూ ఉంటారు.





















