PM Internship Scheme 2025: PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు మళ్లీ పెంపు - ఈ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు!
PM Internship Scheme 2025: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌కు చివరి తేదీని 22 ఏప్రిల్‌కు పొడిగించారు. ఇంకా అప్లై చేయనివాళ్లు ఉంటే దరఖాస్తు చేసుకోండి.

PM Internship Scheme 2025: దేశ యువతకు మరోసారి గోల్డెన్ అవకాశం లభించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Corporate Affairs) ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2025 (PM Internship Scheme 2025)కు నమోదుకు చివరి తేదీని 22 ఏప్రిల్ 2025కు పొడిగించింది. ముందుగా ఈ తేదీ మంగళవారంతోనే ముగిసింది. కానీ దీనిని మరోసారి పొడిగించింది కేంద్రం.
ఈ పథకం యువతకు వాస్తవ పని అనుభవాన్ని అందించడం ద్వారా వారు భవిష్యత్తుకు మెరుగైన రీతిలో సిద్ధం కావడానికి ఉద్దేశించబడింది. ఆసక్తిగల అభ్యర్థులు pminternship.mca.gov.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
- అభ్యర్థి హైస్కూల్/హయ్యర్ సెకండరీ/ఐటీఐ సర్టిఫికెట్/పాలిటెక్నిక్ డిప్లొమా/BA, B.Sc, B.Com, BCA, BBA, B.Pharma వంటి డిగ్రీని పొంది ఉండాలి.
- 21 నుంచి 24 సంవత్సరాల వయస్సు ఉండాలి (దరఖాస్తు చివరి తేదీ ప్రకారం)
- అభ్యర్థి భారతీయ పౌరుడు కావాలి.
- అభ్యర్థి పూర్తి సమయ ఉద్యోగం లేదా చదువులో పాల్గొనకూడదు.
- ఆన్‌లైన్ లేదా దూర విద్య ద్వారా చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులు.
పథకం ప్రత్యేకత ఏమిటి?
ఇంటర్న్‌షిప్ కాలం 12 నెలలు ఉంటుంది. దీనిలో సగం సమయాన్ని అభ్యర్థులు తరగతి గదుల బయట అంటే ఆఫీస్‌లో గడపాల్సి ఉంటుంది. దీంతో ప్రాక్టికల్ అనుభవం వస్తుంది. ఈ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తుంటాారు. నైపుణ్య అభివృద్ధి లేదా ఇంటర్న్‌షిప్ పథకాలకు పూర్తిగా భిన్నమైనది. స్వతంత్రమైనది.
ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోండి
ఈ ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి నమోదు లేదా దరఖాస్తు ఫీజు అవసరం లేదు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సహాయం తీసుకోవచ్చు.
దరఖాస్తు ఎలా చేయాలి
- మొదట అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.in కు వెళ్లండి.
- హోమ్ పేజీలో ఉన్న నమోదు లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ పూర్తి వివరాలను నమోదు చేసి నమోదును పూర్తి చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
- అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- అన్నీ తనిఖీ చేసిన తర్వాత ఫారమ్‌ను సమర్పించండి.
- చివరగా ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.





















