YouTuber Shankar arrest: పెళ్లి చేసుకుంటానని మోసం - మహిళ ఫిర్యాదు - యూట్యూబర్ శంకర్ అరెస్టు
Youtuber Shankar : యూట్యూబర్ శంకర్ ను మహిళ ఫిర్యాదు చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అతని అరెస్టు అక్రమం అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.

Shankar Arrest: హైదరాబాద్ లో మరో యూట్యూబర్ ను పోలీసులు అరెస్టు చేశారు. న్యూస్ లైన్ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహించే శంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. భర్తతో విడిపోయిన ఓ మహిళ తనను పెళ్లి చేసుకంటానని నమ్మించి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత పలుమార్లు శారీరకంగా కలిశామని .. అయితే పెళ్లి చేసుకోమని అడిగే సరికి ముఖం చాటేశాడనన్నారు. తాను విషయం బయట పెడతానని చెబితే.. తన ట్విట్టర్ అకౌంట్ ను పోలి ఉండే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తనపై తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారని ఆ మహిళ తెలిపారు. మహిళ అంబర్ పేటలో ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు తుర్కయాంజల్‌లోని శంకర్ నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.
జర్నలిస్ట్ శంకర్ గాడి అరాచకం...
— ViVeKAnAnd ReDdY✋ (@VAnand_INC) March 29, 2025
విడకాలు అయిన 2 పిల్లల తల్లి అయిన మహిళను పెళ్ళి చేసుకుంటా అని నమ్మించి మోసగించిన వైనం...
తనను మోసం చేసిన జర్నలిస్ట్ శంకర్ చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సింది గా కంప్లైంట్ ఇచ్చిన సదరు మహిళలు.
కేసు నమోదు చేసిన పోలీసులు pic.twitter.com/gOkojB4Oy2
యూట్యూబర్ శంకర్ ను అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు ఆయన పలు కారణాలతో ఆలస్యం చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు హెచ్చరించారు. బ్రష్ చేసుకోవడానికి రెడీ అవడానికి అంటూ ఆయన రెండు, మూడు గంటల పాటు పోలీసుల్ని నిరీక్షించేలా చేశారు. చివరికి పోలీసులు కారులో బలవంతంగా ఎక్కించాల్సి వచ్చింది.
తెలంగాణ పిల్ల 2.0, 3.0, 4.0 పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మహిళలను అసభ్యంగా దూషించిన జర్నలిస్ట్ శంకర్..
— Revanth Sainyam Telangana (@Revanth_Sainyam) March 29, 2025
తూ ని బతుకు @shankar_journo pic.twitter.com/NIh158q5uv
యూట్యూబర్ శంకర్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర పదజాలంతో పోస్టులు పెడుతూ ఉంటారు. అందుకే యూట్యూబర్ శంకర్ ను పోలీసులు అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించినందుకే అరెస్టు చేశారని వియ్ స్టాండ్ వింత్ శంకర్ అని సపోర్టు చేస్తున్నారు.
మరోసారి @shankar_journo అక్రమ అరెస్ట్ ?
— YSR (@ysathishreddy) March 29, 2025
ఇది అరెస్టా? కిడ్నాపా?
ఎవరు తీసుకుపోతున్నారు?
ఎక్కడికి తీసుకుపోతున్నారో చెప్పరు ?
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న
సోషల్ మీడియాని, జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూడడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం.
శంకర్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం.… pic.twitter.com/nl3HmgGrUm
అయితే శంకర్ ను సోషల్ మీడియా పోస్టుల కేసులో కాకుండా ఓ మహిళ ఫిర్యాదుతో అరెస్టు చేశారు. అయినా తప్పుడు ఫిర్యాదులతో అరెస్టు చేయించారని ఆరోపిస్తున్నారు.
అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం జర్నలిస్టునని నీతులు చెబుతూ ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
చెప్పేవి శ్రీరంగ నీతులు… చేసేవి నీచపు పనులు!
— Kattar Congress (@kattarcongresii) March 29, 2025
జర్నలిస్ట్ అనే పేరుతో అడ్డగోలు రాతలు రాసే శంకర్, ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని మోసగించి, లొంగదీసుకుని తన స్వార్థం తీర్చుకొని వదిలేసిన కీచకుడు.
🔹సదురు మహిళా అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన పిర్యాదుతో ఈ భాగోతం బయటపడింది..
శంషాబాద్… pic.twitter.com/V0oJAHV0Lv
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

