Hyderabad Cricket Association :HCAకు 10 శాతం పాసులు ఇచ్చేందుకు ఓకే- SRH యాజమాన్యంతో వివాదానికి ఫుల్‌స్టాప్
Hyderabad Cricket Association:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం టీకప్పులో తుపానులా ముగిసింది. పది శాతం టికెట్లు ఇచ్చేందుకు SRH ఓకే చెప్పింది.

Hyderabad Cricket Association :హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. త్రైపాక్షిక ఒప్పందం ప్రకారమే టికెట్ల కేటాయింపు ఇతర ప్రక్రియ నడిచేలా ఇరు వర్గాలు అంగీకరించాయి. ఈ మేరకు HCA సెక్రటరీ దేవరాజ్ SRH యాజమాన్యం తరఫున వచ్చిన ప్రతినిధులతో చర్చించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు పాత ఒప్పందం ప్రకారం పది శాతం కాంప్లిమెంటరీ టికెట్లు ఇచ్చేందుకు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం అంగీకరించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. ఉప్పల్ జరిగే మ్యాచ్‌లన్నింటినీ విజయం అయ్యేలా సహకరించేందుకు హెచ్‌సీఏ అంగీకరించింది.
హెచ్‌సీఏ అధ్యక్షుడిపై ఎస్‌ఆర్‌హెచ్ ఆరోపణలు
ఈ చర్చలు సఫలం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు దివ్యాంగులకు పాస్‌లు ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో వివాదం మొదలంది. పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఒత్తిడి తీసుకొస్తోందని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆరోపించింది. ఈ మేరకు ఏసీఏ అసోసియేషన్ కోశాధికారికి లేఖ రాశారు. అడినన్ని పాస్‌లు ఇవ్వలేదని కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేసినట్టు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావే బెదిరింపులకు దిగారని కూడా వెల్లడించారు. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని వార్నింగ్ ఇచ్చారు. .
విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం
ఈ లేఖ సంచలనం కావడంతో ఎలాంటి వివాదం లేదని హెచ్‌సీఏ ప్రతిష్ట దిగజార్చేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని హెచ్‌సీఏ అధ్యక్షుడి ఆఫీస్‌్ ఆరోపించింది. నకిలీ మెయిల్స్‌లో ఇదంతా కావాలని చేస్తున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన వివాదం కావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, స్టేడియం సిబ్బందిని విచారించారు. టికెట్ల అమ్మకం, పాసుల జారీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వివాదాల కేంద్రం హెచ్‌సీఏ
ఎప్పుడూ వివాదాల కేంద్రంగా హెచ్‌సీఏ ఉంటోంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా గతంలో ఫిర్యాదు చేశారు. ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే అంతర్జాతీయ మ్యాచ్‌ల కాంట్రాక్టుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అప్పుడు కూడ విజిలెన్స్ విచారణ జరిగింది. అంతకు ముందు కీలకమైన ఆటగాళ్లను తొక్కేస్తున్నారని ప్రతిభ ఉన్న వాళ్లను రాణివ్వడం లేదనే ఆరోపణ ఉండేది. కొన్ని క్లబ్‌ల నుంచి వచ్చిన వాళ్లకే అవకాశాలు ఇస్తున్నారని విమర్శలు ఉండేవి.





















