Women Investment: ఆడవాళ్లు ఆర్థికంలో అదరగొడుతున్నారు: AMFI-Crisil నివేదిక
Women Investment: దేశంలో మహిళల ఆర్థిక విధానంలో గణనీయమైన మార్పు సంభవిస్తోందని AMFI-Crisil తాజా నివేదిక వెల్లడించింది. పొదుపు నుంచి పెట్టుబడుల వైపు మహిళలు అడుగులు వేస్తున్నారని తెలిపింది.

అతివల్లో ఆర్థిక అవగాహన భాగా పెరిగిందంట.. మన దేశంలో మ్యూచ్‌వల్ ఫండ్స్ పెట్టుబడులు, సిప్పుల్లో పొదుపులు అన్నీ లేడీస్ ఎక్కువుగా చేసేస్తున్నారు. పొదుపు నుంచి పెట్టుబడుల వైపు అడుగులు వేస్తున్నారు అని Association of Mutual Funds in India AMFI-, ప్రముఖ కేపిటల్ మార్కెట్ కంపెనీ CRISIL సంయుక్త నివేదికలో వెల్లడించాయి. పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, డిజిటల్ ఆర్థిక సాంకేతికత , టార్గెటెడ్ ఫైనాన్షియల్ గోల్స్ అనేవి దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని నివేదిక తెలిపింది.
నివేదికలోని ముఖ్య అంశాలు:
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రచురించిన ఆర్థిక చేరిక సూచిక (FI-Index) 2023 మార్చిలో1 నుంచి 2024 మార్చిలో 64.2కి పెరిగింది. ఈ పెరుగుదలకు మహిళల బ్యాంకు ఖాతాల సంఖ్య గణనీయంగా పెరగడం ఒక కీలక కారణం. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) కింద ఉన్న 53.13 కోట్ల ఖాతాల్లో 29.56 కోట్లు మహిళలవే.
- 2017-18లో ఉద్యోగం, ఉపాధి ఉన్న మహిళల సంఖ్య3%గా ఉంటే 2023-24 నాటికి 41.7%కి చేరింది. గ్రామీణ మహిళలు ఈ మార్పుకు నాయకత్వం వహిస్తున్నారు, వారి ఉద్యోగిత 47.6%కి చేరుకుంది.
- 2014 నుంచి 2021 వరకు డిజిటల్ చెల్లింపు మాధ్యమాలను ఉపయోగించే మహిళల సంఖ్య 14% నుంచి 28%కి రెట్టింపు అయింది. ఇది ఆర్థిక లావాదేవీలలో లింగ వివక్షను తగ్గించి, పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది.
పొదుపు కాదు.. పెట్టుబడులు
ఇంతకు ముందు మహిళలు పోస్టాఫీసు పొదుపు పథకాల్లోనూ సేవింగ్స్ అకౌంట్లోలనూ.. లేదా రికరింగ్ డిపాజిట్లలోనూ డబ్బు దాచేవాళ్లు. కానీ వారు కూడా ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మ్యూచ్‌వల్ ఫండ్స్ (Mutual Funds)లో పెట్టుబడి పెట్టే మహిళల సంఖ్య బాగా పెరిగింది. గడచిన ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే మహిళల సంఖ్య సంవత్సరానికి 20% (CAGR) వృద్ధి చెందింది. కొత్త మ్యూచువల్ ఫండ్ ఫోలియోల్లో సుమారు 25% మహిళలదే, ఇది సాంప్రదాయ పొదుపు నుంచి మార్కెట్ ఆధారిత పెట్టుబడుల వైపు మహిళలు మారుతున్నట్లు సూచిస్తుంది.
SIPs - దీర్ఘకాల సంపద సృష్టిపై ఆసక్తి:
మహిళా పెట్టుబడిదారులు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIPs)ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. గత ఏడాది నమోదైన SIPలలో దాదాపు 40% మహిళలవే. దీర్ఘకాల సంపద సృష్టిపై దృష్టి పెట్టడం మహిళల్లో పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాల్లో వారు పరిణితి చెందుతున్నారన్న విషయాన్ని సూచిస్తోంది. పట్టణ మహిళలు పెట్టుబడుల్లో ఆధిపత్యం వహిస్తున్నప్పటికీ, సెమీ-అర్బన్ గ్రామీణ మహిళలు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లోకి చొచ్చుపోవడం సంవత్సరానికి 15% పెరిగింది.
భవిష్యత్తు మార్గం
ఆర్థిక అవగాహన -పెట్టుబడి సంబంధిత కార్యక్రమాలు మహిళలు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అధిక ఆదాయం, డిజిటల్ అవలంబన, నిర్మాణాత్మక పెట్టుబడి ఎంపికలతో మహిళలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మరింత పెద్ద పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారని నివేదికలో చెప్పారు. 2030 నాటికి మ్యూచువల్ ఫండ్ ఆస్తుల నిర్వహణ (AUM)లో మహిళల వాటా 30%కి చేరవచ్చని AMFI-Crisil, అంచనా వేసింది. మహిళల AUM 2019 నుంచి 2024 వరకు Rs 4.59 లక్షల కోట్ల నుంచి Rs 11.25 లక్షల కోట్లకి పెరిగింది,





















