Ratan Tata will : రతన్ టాటా వారసుల్లో శాంతను నాయుడు పేరు- నీడలా వెంట ఉండే వ్యక్తికి బిగ్ సర్‌ప్రైజ్
Ratan Tata will :రతన్ టాటా తన ఆస్తులలో ఎక్కువ భాగాన్ని దానం చేశారు. దాదాపు 3800 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, వ్యక్తిగత ఆస్తులు, టాటా సన్స్ లో 0.83% వాటా ఉన్నాయి.

Shantanu Naidu Name In Ratan Tata Will: రతన్ టాటా వారసుల గురించి ఇప్పుడు చాలా చాలా పెద్ద విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు వివిధ మీడియాలు రిపోర్టు చేస్తున్న వివరాల ప్రకారం, రతన్ టాటా తన ఆస్తుల్లో దాదాపు 3800 కోట్ల రూపాయలను మంచి పనులకు దానం చేశారు.
అంతేకాకుండా, రతన్ టాటా వారసుల్లో ఆయనకు దగ్గరగా ఉన్నవారి పేర్లు కూడా ఉన్నాయి. అక్కడ ఒకరికి మంచి ఆస్తి లభించింది. మరికొందరికి పెద్ద బహుమతులు లభించాయి. రతన్ టాటా వారసుల్లో ఆయనకు అత్యంత సన్నిహితుడైన శాంతను నాయుడుకు ఏమి లభించిందంటే.
రతన్ టాటా వారసుల్లో శాంతను నాయుడుకు ఏమి లభించింది?
శాంతను నాయుడు గురించి చాలా మందికి తెలుసు. ఆయన రతన్ టాటా చివరి రోజుల్లో ఆయనతో నీడలా వెంటే ఉన్నారు. రతన్ టాటా అత్యంత గౌరవించే కొద్దిమందిలో శాంతను నాయుడు ఒకరని చెబుతారు. ఇప్పుడు జాతీయ మీడియా చెబుతున్నట్టు రతన్ టాటా వారసుల్లో శాంతను నాయుడు పేరు కూడా ఉందని పేర్కొంటున్నాయి. నిజానికి, శాంతను నాయుడు టాటా ట్రస్ట్‌లో డిప్యూటీ మేనేజర్‌గా ఉండే వాళ్లు. రతన్ టాటా వ్యక్తిగత సహాయకుడు కూడా పని చేశారు. రతన్ టాటా వారసుల్లో శాంతను నాయుడుకు లభించింది. వీటితోపాటు గుడ్‌ఫెలోస్ స్టార్టప్‌లో వాటా కూడా ఇచ్చారు. అంతేకాకుండా శాంతను విద్య ఋణం కూడా మాఫీ చేసినట్టు విల్‌లో పేర్కొన్నట్టు చెబుతున్నారు.
శాంతను నాయుడు ఎవరు?
శాంతను నాయుడు రతన్ టాటాకు సన్నిహితుడు. సహాయకుడిగా మంచి పేరు పొందారు. ఆయన 1993లో పూణే, మహారాష్ట్రలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. శాంతను తన ప్రాథమిక విద్య తర్వాత సావిత్రిబాయి ఫులే పూణే విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఆ తరువాత, ఆయన కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి MBA చేశారు, అక్కడ ఆయనకు అనేక అవార్డులు కూడా లభించాయి.
శాంతనునాయుడు 2017 నుంచి టాటా ట్రస్ట్‌తో అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం టాటా గ్రూప్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అంతేకాకుండా, ఆయన కొత్త స్టార్టప్‌లలో పెట్టుబడులకు టాటా గ్రూప్‌కు సలహా కూడా ఇస్తున్నారు.
శాంతను నాయుడుకు సమాజ సేవ, జంతువుల పట్ల ప్రేమ ఉంది. ఆయన "మోటోపాజ్" అనే సంస్థను స్థాపించారు, ఇది రోడ్లపై తిరిగే కుక్కలకు సహాయం చేస్తుంది. ఈ సంస్థ ద్వారా, ఆయన ప్రత్యేక డెనిమ్ కాలర్లను తయారు చేశారు, వీటిలో రిఫ్లెక్టర్లు ఉంటాయి, దీనివల్ల రాత్రి సమయంలో రోడ్లపై జంతువుల రక్షణగా నిలుస్తుంది.
దానం చేసిన ఆస్తుల్లో ఏం ఉన్నాయి?
దానం చేసిన ఆస్తుల విషయానికి వస్తే, అవి దాదాపు 3800 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. ఇందులో వ్యక్తిగత ఆస్తులే అతిపెద్ద భాగం. అంతేకాకుండా, ఈ దానం చేసిన ఆస్తుల్లో టాటా సన్స్‌లో 0.83 శాతం వాటా కూడా ఉంది. దీనిని టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ వంటి దాతృత్వ సంస్థలకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా, రతన్ టాటా ఆస్తులు, వీటిలో ఆయన జుహులో 13,000 చదరపు అడుగులలో నిర్మించిన బంగ్లా, అలిబాగ్ బంగ్లా, 350 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లలో ఎక్కువ భాగం ఇతరులకు సహాయపడేందుకు ఉపయోగించబడతాయి.





















