By: Arun Kumar Veera | Updated at : 26 Feb 2025 12:48 PM (IST)
IPOకి ఆమోదం తెలిపిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు ( Image Source : Other )
Tata Capital IPO News: దేశంలోని అతి పెద్ద వ్యాపార సమూహం టాటా గ్రూప్‌లోని 'టాటా క్యాపిటల్ లిమిటెడ్' షేర్ మార్కెట్‌లోకి రావడానికి మరో లైన్ క్లియర్ అయింది. ఈ గ్రూప్‌లోని NBFC కంపెనీ అయిన 'టాటా క్యాపిటల్', IPOను ప్రారంభించడానికి ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. టాటా క్యాపిటల్, ఈ IPO ద్వారా కొత్త షేర్లను (Fresh Shares) జారీ చేసి ప్రైమరీ మార్కెట్ (IPO Market) నుంచి డబ్బు సేకరిస్తుంది. అదే సమయంలో, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు కూడా ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో తమ వాటాలను పాక్షికంగా విక్రయిస్తారు. టాటా క్యాపిటల్ బోర్డు, కంపెనీలోని ప్రస్తుత వాటాదారుల నుంచి రైట్స్ ఇష్యూ (Tata Capital Rights Issue) ద్వారా రూ. 1,504 కోట్లు సేకరించడానికి ఆమోదం తెలిపింది.
IPOలో భాగంగా టాటా క్యాపిటల్ 23 కోట్ల ఫ్రెష్ షేర్లను జారీ చేస్తుంది. ఆఫర్ ఫర్ సేల్ షేర్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఫ్రెష్ షేర్లు + ఆఫర్ ఫర్ సేల్ షేర్లతో కలిపి, ఈ IPO ద్వారా, టాటా క్యాపిటల్ ప్రైమరీ మార్కెట్ నుంచి రూ. 15,000 కోట్లు సేకరిస్తుందని అంచనా వేస్తున్నారు.
IPO కోసం డైరెక్టర్ల బోర్డు నుంచి ఆమోదం లభించింది కాబట్టి, ఇప్పుడు, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) వద్ద ముసాయిదా పేపర్‌ను (DHRP) ఈ కంపెనీ సమర్పించాలి. IPO సైజ్, IPO తేదీ, ప్రైస్ బ్యాండ్ సహా ఇతర వివరాలు ఆ తర్వాత తెలుస్తాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి టాటా క్యాపిటల్ IPO ఓపెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. టాటా క్యాపిటల్ ఒక ఉన్నత స్థాయి ఎన్‌బీఎఫ్‌సీ (Upper-layer NBFC) కాబట్టి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, 2025 సెప్టెంబర్ 2025 కంటే ముందు టాటా క్యాపిటల్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయాలి. RBI రూల్స్ ప్రకారం, టాటా సన్స్‌ను కూడా 2025 సెప్టెంబర్ నాటికి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. టాటా క్యాపిటల్‌లో టాటా సన్స్‌కు 93 శాతం వాటా ఉంది.
దూసుకుపోయిన టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ షేర్లు
టాటా క్యాపిటల్ IPOకి ఆమోదం లభించడంతో, నష్టాల మార్కెట్‌లోనూ టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ షేర్లు (Tata Investment Corporation Share Price) బలంగా పెరిగాయి. మంగళవారం (25 ఫిబ్రవరి 2025) మార్కెట్ ప్రారంభంలో దాదాపు 10 శాతం పెరిగి రూ. 6,344 స్థాయికి చేరుకుంది. ఆ రోజు మార్కెట్ ముగిసే సమయానికి దాదాపు 7 శాతం లాభంతో రూ. 6,158 వద్ద క్లోజ్ అయింది.
2023 నవంబర్‌లో, టాటా గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ IPO వచ్చింది & నవంబర్ 30, 2023న ఆ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదైంది. టాటా టెక్నాలజీస్ IPO ఇష్యూ ధర రూ.500. అయితే, ఆ స్టాక్ 140 శాతం పెరిగి రూ.1200 వద్ద లిస్ట్ అయింది & మొదటి రోజే మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు - దేశ రాజధానితో పోలిస్తే భాగ్యనగరం చాలా బెటర్
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్