search
×

House Prices In Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు - దేశ రాజధానితో పోలిస్తే భాగ్యనగరం చాలా బెటర్‌

Residential House Prices: 2024 నాలుగో త్రైమాసికంలో దిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివాస గృహాల ధరలు అత్యధికంగా 31 శాతం జంప్‌ చేశాయి. ఆ తరువాత, బెంగళూరులో 23 శాతం వృద్ధి నమోదైంది.

FOLLOW US: 
Share:

Increase In Residential House Prices: డిమాండ్ పెరుగుదల & సానుకూల మార్కెట్ సెంటిమెంట్ కారణంగా భారతదేశంలో ఇళ్ల రేట్లకు రెక్కలు వచ్చాయి. దేశంలోని టాప్-8 నగరాల్లో, నివాస గృహాల సగటు ధరలు 2024 చివరి త్రైమాసికంలో (2024 అక్టోబర్‌-డిసెంబర్‌ కాలం) చుక్కలు చూపించాయి. అంతకుముందు సంవత్సరం అదే కాలంతో పోలిస్తే, సమీక్ష కాలంలో 10 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

మంగళవారం విడుదలైన తాజా రిపోర్ట్‌ ప్రకారం, 2021 నుంచి ఇప్పటి వరకు వరుసగా 16వ త్రైమాసికంలోనూ ఇళ్ల సగటు రేట్లు పెరిగాయి. CREDAI-Colliers-Lyses Foras రిపోర్ట్‌ ప్రకారం, దేశంలోని 8 ప్రధాన నగరాల్లోనూ ధరలు పెరిగాయి. మన దేశంలో, సాధారణంగా, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దిల్లీ-NCR, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌ను టాప్‌-8 సిటీస్‌గా పరిగణిస్తారు. పరిస్థితులను బట్టి ఈ లిస్ట్‌ మారుతుంది. 

టాప్‌-8 నగరాల్లో ధరలు ఎంత పెరిగాయి?

2023 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే, కార్పెట్ ఏరియా ప్రాతిపదికన, 2024 నాలుగో త్రైమాసికంలో దిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇళ్ల రేట్లు సంవత్సర కాలంలోనే అత్యధికంగా 31 శాతం వృద్ధి చెందాయి. ఇక్కడ చదరపు అడుగు ధర (price per sq ft) రూ. 11,993 కి చేరుకుంది.

ఐటీ రాజధానిగా పరిగణించే బెంగళూరు రెండో స్థానంలోకి వచ్చింది, ఆ నగరంలో నివాస గృహాల ధరలు 23 శాతం పెరిగాయి. ఈ నగరంలో చదరపు అడుగు సగటున రూ. 12,238 పలుకుతోంది.

2024 అక్టోబర్-డిసెంబర్ కాలంలో, అహ్మదాబాద్‌లో ఇళ్ల సగటు ధరలు ఏడాదిలో 15 శాతం పెరిగాయి, చదరపు అడుగుకు రూ.7,725 కు చేరుకున్నాయి.

పుణెలో, సమీక్షలో ఉన్న కాలంలో 9 శాతం వార్షిక ధర పెరుగుదల నమోదైంది. చదరపు అడుగు ేటు రూ. 9,982 కి చేరుకున్నట్లు డేటా చూపించింది.

చెన్నైలో ఇళ్ల ధరలు యావరేజ్‌గా 6 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 8,141 కు చేరాయి.

ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (MMR) ధరలు 3 శాతం వృద్ధిని నమోదు చేసి చదరపు అడుగుకు రూ.20,725 కి జంప్‌ చేశాయి.

హైదరాబాద్‌లో రేట్లు సగటున 2 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 11,351 కి చేరుకున్నాయి.

కోల్‌కతాలో ధరలు సరాసరి 1 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.7,971 పలుకుతున్నాయి.

2025లో, 'సరసమైన గృహాల విభాగం'లో (Affordable Housing Segment) అమ్మకాలు బలంగా ఉంటాయని, లగ్జరీ & అల్ట్రా-లగ్జరీ విభాగాలలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని CREDAI-Colliers-Lyses Foras నివేదిక వెల్లడించింది. 

ఇళ్ల కొనుగోళ్లలో కనిపిస్తున్న బూమ్‌ కారణంగా, వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ 'అమ్ముడుపోని ఇన్వెంటరీ' (ఇండివిడ్యువల్‌ ఇళ్లు, విల్లాలు & అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు) తగ్గుతూనే ఉంది. ఆరోగ్యకరమైన డిమాండ్ కారణంగా 2024 నాలుగో త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 5 శాతం తగ్గింది.

2024 డిసెంబర్ చివరి నాటికి, భారతదేశం మొత్తంలో, అమ్ముడుపోని ఇన్వెంటరీ గత రెండేళ్లలో మొదటిసారిగా 10 లక్షల గృహాల కంటే తక్కువగా ఉంది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం అమ్ముడుపోని ఇన్వెంటరీ లిస్ట్‌లో 40 శాతం వాటాతో ప్రధాన పాత్ర పోషించింది. పుణెలో అమ్ముడుకాని ఇన్వెంటరీ అత్యధికంగా 14 శాతం తగ్గింది, ఆ తరువాత హైదరాబాద్‌లో 13 శాతం క్షీణించింది.

అమ్ముడుపోని ఇన్వెంటరీ తగ్గుతోందంటే.. గతంలో అమ్ముడుకాకుండా ఆగిపోయిన ఇళ్లు కూడా ఇప్పుడు అమ్ముడుపోతున్నాయని, ఓవరాల్‌గా ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయని అర్ధం.

ఇళ్ల ధరలు మరింత పెరగవచ్చు

వడ్డీ రేట్లలో కోత ప్రారంభమైంది కాబట్టి ప్రజల స్థోమత, డిమాండ్‌ మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది. దీంతోపాటు, హౌసింగ్‌ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరసమైన గృహాల విభాగానికి ఊతం ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మరో ఆసక్తికర కథనం: ఊపిరి పీల్చుకోండి, తగ్గిన గోల్డ్‌-సిల్వర్‌ రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ 

Published at : 26 Feb 2025 11:16 AM (IST) Tags: House prices in Hyderabad property rates Real Estate Increase in house prices Residential house prices

ఇవి కూడా చూడండి

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

టాప్ స్టోరీస్

Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!

Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్

Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్