అన్వేషించండి

Viral News: ఇద్దర్ని ప్రేమించాడు .. గొడవల్లేకుండా ఇద్దర్నీ పెళ్లి చేసుకున్నాడు - ఈ దశాబ్దాపు లవర్ ఇతడే !

Telangana: ఒకే మండపంలో ఇద్దర్ని పెళ్లి చేసుకున్నాడో యువకుడు. ఒకేసారి ఇద్దర్ని ప్రేమించాడు. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

Viral Video: ఈ రోజుల్లో ఒక్క భార్యతోనే కుటుంబాన్ని నిర్వహించడం కష్టం. సినిమాల్లో హీరోయిన్ ను తీక్షణంగా చూసినా ఆ భార్య అసలు ఒప్పుకోదు. అలాంటిది ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో జీవించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇద్దర్ని ప్రేమించిన ఓ యువకుడు ఈ రిస్క్ తీసుకోవాలని డిసైడయ్యాడు. అనుకున్న విధంగా అన్ని కుటుంబాలను ఒప్పించి ఒకే మండపంలో ఇద్దర్నీ పెళ్లి చేసేసుకున్నాడు.
Viral News: ఇద్దర్ని ప్రేమించాడు .. గొడవల్లేకుండా ఇద్దర్నీ పెళ్లి చేసుకున్నాడు - ఈ దశాబ్దాపు లవర్ ఇతడే !

 కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువకుడు ఒకే మండపంలో ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు. సిడాం సూర్యదేవ్ అనే వ్యక్తి లాల్దేవి, జలకర్ దేవి అనే ఇద్దరిని ప్రేమించాడు. ప్రేమించిన ఆ ఇద్దరు యువతులకు విషయం చెప్పి, వారి సమ్మతితో ఇద్దర్ని పెండ్లి చేసుకున్నాడు. వారితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు సైతం సమ్మతివ్వడంతో ఆ పెండ్లికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
Viral News: ఇద్దర్ని ప్రేమించాడు .. గొడవల్లేకుండా ఇద్దర్నీ పెళ్లి చేసుకున్నాడు - ఈ దశాబ్దాపు లవర్ ఇతడే !

అదే సమయంలో ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని, బాండ్ పేపర్ రాసి ఇవ్వడంతో ఆ ముగ్గురు వివాహ బంధంతో ఏకమయ్యారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్నూర్ లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెండ్లికి మూడు గ్రామాల ప్రజలతో పాటు, వరుడు, ఇద్దరు వధువుల తరుపు పెద్దలు హాజరయ్యారు. ఆదివాసి సంప్రదాయాలతో డోలు వాయిద్యాల నడుమ ఘనంగా వీరి పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు బంధు మిత్రులు పెళ్లికి హాజరై ఈ కొత్త జంటలనూ ఆశీర్వదించారు.                    

మామూలుగా అయితే ఇలా ఇద్దర్ని పెళ్లి చేసుకోవడం నేరం. చట్ట విరుద్ధం కూడా. అయితే గిరిజనులు పెళ్లిళ్లను తమ సంప్రదాయాలు, కట్టుబాట్ల ప్రకారమే నిర్వహించుకుంటారు. ఏమైనా సమస్యలు వచ్చినా పెద్ద మనుషుల ద్వారా పంచాయతీ చేసుకుని పరిష్కారాలు చేసుకుంటారు. అందుకే గిరిజనులు కుటుంబాల్లో అప్పుడప్పుడు బహు భార్యత్వం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల.. గిరిజనుల్లో ఓ మహిళ ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఆదిలాబాద్ లోని గిరిజన ప్రాంతాల్లో ఇలా ఒకరికి ఇద్దరు భార్యలు ఉండటం అనేది సహజమన్న అభిప్రాయం ఉంది.            

అయితే ఇది అన్ని గిరిజన తెగలకూ ఒకేలా ఉండదు. కొన్ని గిరిజన తెగలు బహుభార్యత్వాన్ని ఆచరిస్తుండగా, మరికొన్ని ఏకభార్యత్వాన్ని పాటిస్తూంటాయి. కొన్ని గిరిజన సమాజాల్లో, బహుభార్యత్వం సాంప్రదాయంగా ఉంది. రిజన తెగల్లోని ఆచారాలు, సంప్రదాయాలన్ని దాదాపుగా సంప్రదాయ చట్టాల పర్యవేక్షణలో ఉంటాయి. అవే గిరిజనులకు గుర్తింపు. ఈ ప్రత్యేకత మూలంగానే కుల, మత వర్గాల నుంచి గిరిజనులు వేరుగా ఉంటారని అనుకోవచ్చు. అయితే రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కుకు ఎలాంటి భంగం వాటిల్లకూడదు. ముఖ్యంగా మహిళల అంశంలో అది కచ్చితంగా అనుసరించాల్సి ఉంది. కానీ వారు తమకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్లకు వస్తేనే కేసులు నమోదు చేస్తారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget