Crime News: ఫ్లైట్లో వస్తారు .. ఏటీఎం కట్ చేసి లక్షలు దోచుకెళ్లిపోతారు - హైదరాబాద్ పోలీసులకు చిక్కిన గ్యాంగ్ !
Hyderabad: ఏటీఎంలను కట్ చేసి దోచుకెళ్లే దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హర్యానా, రాజస్తాన్‌ల నుంచి ఫ్లైట్లలో వచ్చి పని పూర్తి చేసుకెళ్లిపోతారు.

ATM Thieves gang: ఉత్తరాదిలో కొన్ని గ్రామాల నుంచి డ్యూటీలకు వచ్చినట్లుగా దక్షిణాదికి వచ్చి దోపిడీలు చేసి మళ్లీ తమ స్వగ్రామాలకు వెళ్లిపోయే ముఠాలు చాలా ఉంటాయి. అలాంటి ముఠాల్లో ఒకటి హైదరాబాద్ పోలీసులకు చిక్కింది.
మూడు నిమిషాల్లో రెండు టీఎంలను దోపిడీ చేసిన ముఠా
మహేశ్వరం, రావిర్యాల్లో మార్చి ఒకటో తేదీన రెండు ఏటీఎంలలో డబ్బులు దోచుకెళ్లారు. ఏటీఎంలను కట్ చేసి.. చాలా నేర్పుగా లక్షలు కొట్టేసి వెళ్లిపోయారు. పోలీసులు ఈ పని ఎవరు చేశారో పూర్తి స్థాయిలో ఆరా తీశారు. కొన్ని వందల సీసీఫుటేజీలు గుర్తించారు. ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన తర్వాత వారికి అసలు క్లారిటీ వచ్చింది. వారి కోసం హర్యానాకు వెళ్లి ఖాకీ సినిమాలో ఛేజ్ చేసినట్లుగా చేసి.. నిందితుల్ని అరెస్టు చేసి తీసుకొచ్చారు.
నిర్మానుష్య ప్రాంతాల్లోని ఏటీఎంలే టార్గెట్
కేవలం మూడు అంటే 3 నిమిషాల్లో ఎటిఎం లో ఉన్న 29 లక్షలు కాజేసిన ఈ దొంగలను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. గతంలో కుషాయిగూడ, BDL బానూర్, ఒడిశా లో ఏటీఎం లను కొల్లగొట్టారని పోలీసులు తెలిపారు. HDFC, SBI ఎటిఎం ల చోరీ కేస్ చెదించేందుకు చాలా కష్టపడ్డామని కమిషనర్ తెలిపారు. నిందితులు మొత్తం ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ కానీ.. హైదరాబాద్ కు చెందిన రాహుల్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా గుర్తించామన్నారు.
రాజస్థాన్, హర్యానాల్లోని ముఠాలు
హర్యానా లో ఉన్న ఒకే గ్రామానికి చెందిన నిందితులు .. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఏటీఎం లే వీరి టార్గెట్ చేసుకుంటారని పోలీసులుతెలిపారు. రావిర్యాల్ తో పాటు వరపర్తి, మైలార్దేవ్ పల్లి కొంగరకలాన్ వెళ్ళారు అక్కడ కూడా రెక్కి చేసి మార్చ్ 1 న రావిర్యాల లో ఏటీఎం లో ఉన్న 29.60 లక్షలు ఎత్తుకెళ్లారు. జులాయి సినిమా తరహా లో ఏటీఎం లో డబ్బులు కొట్టేసిన రాజస్థాన్ , హర్యానా ముఠా అని.. యూట్యూబ్ లో విడియో లు చూసి ఏటీఎం ను కట్ చేసినట్లుగా గుర్తించారు. మొత్తం 10 మందిని గుర్తించామని.. అందరూ
రాజస్థాన్, హర్యానా కు చెందిన ముఠా సభ్యులన్నారు.
సినిమా తరహాలో దోపిడీ - అదే తరహాలో పట్టుకున్న పోలీసులు
ఏటీఎంను దొంగతనం చేసేందుకు ఫ్లైట్ లో ఒచ్చిన నిందితులు .. పని అయిపోయాక మళ్లీ ఫ్లైట్ లోనే వెల్లిపోయారు. సినిమా తరహా లో దొంగతనానికి యంత్రాలను ప్రత్యేకంగా కొనుగోలు చేసేవారు. మరో ఐదుగుర్ని అరెస్టు చేయాల్సి ఉంది. 4 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.





















