Earthquake Today :12 నిమిషాల్లో రెండు భీకర భూకంపాలు- బ్యాంకాక్ నుంచి దిల్లీ వరకు కంపించిన భూమి
Tremors in India:మయన్మార్ భూకంప ప్రభావం భారత్‌పై పడిందనే ప్రచారం జరుగుతోంది. ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Tremors in India:విధ్వంసక భూకంపం శుక్రవారం (మార్చి 28, 2025)న మయన్మార్, బ్యాంకాక్, చైనా మరియు భారతదేశ భూభాగాలను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. భూకంప కేంద్రం మయన్మార్‌లోని సాగాయింగ్ నగరం సమీపంలో ఉంది.మయన్మార్‌లో ఏర్పడిన భూకంపం పక్కనే ఉన్న దేశాలపై కూడా ప్రభావం పడింది. ఈ భూంకం ధాటికి బ్యాంకాక్‌లో విధ్వంసం సృష్టించింది. ఈ భూంకంపం ప్రభావం ఒక్క ఆ రెండు దేశాలకే పరిమితం కాలేదు. చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలపై పడింది.
యమన్మార్ భూకంపం ప్రభావం భారత్‌పై కూడా పడింది. ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ఢిల్లీసహా పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. జనం బయటకు పరుగులు తీశారు. ఇంట్లో వస్తువులు ఊగడం కనిపించింది.
భూకంపం అత్యధికంగా బ్యాంకాక్‌లో విధ్వంసం సృష్టించింది. అక్కడ ఎత్తైన భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఒక మసీదు కూలిపోయింది ఇరవై మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) భూకంప కేంద్రం మయన్మార్‌లోని సాగాయింగ్ నగరం నుంచి 16 కి.మీ ఉత్తర-పశ్చిమంలో మండలే సమీపంలో ఉందని తెలిపింది. భూకంపం కారణంగా నెపిడో రోడ్లలో పెద్ద పెద్ద బీటలు పడ్డాయి. అధిక ఎత్తుగల భవనాలకు నష్టం వాటిల్లింది. మధ్యాహ్నం 12.50 గంటలకు మొదటిసారి భూకంపం సంభవించింది.
మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం #myanmar #Bangkok #earthquake #Myanmarearthquake #Bangkokearthquake #ABPDesam #telugunews pic.twitter.com/kTXANuJ7I4
— ABP Desam (@ABPDesam) March 28, 2025
12 నిమిషాల్లో రెండు భూకంపాలు
USGS ప్రకారం మొదట 7.7 తీవ్రత గల భూకంపం వచ్చింది. 12 నిమిషాల తర్వాత మరో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 6.4గా ఉంది. మయన్మార్ ప్రభుత్వం మండలే, నెపిడో, బాగో, మెగ్వేలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. భూకంపం వల్ల ఇప్పటివరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు, వారిలో 5 మంది మయన్మార్‌లో, 20 మంది బ్యాంకాక్‌లో ఉన్నారు.
This is the impact of the #Earthquake (7.7 Richter) in Bangkok, nearly 1200 Kms away from the epicentre in Mandalay, Myanmar.
— Pranav (@PranavMatraaPPS) March 28, 2025
Wondering if there was someone in that pool when it hit, could they’ve even been yanked off to final destination??#แผ่นดินไหวpic.twitter.com/N5QjJhsaNC
బ్యాంకాక్‌లో అత్యధిక విధ్వంసం
సోషల్ మీడియాలో భూకంపానికి సంబంధించిన వీడియోలు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌కు చెందినవి, వీటిలో పెద్ద పెద్ద భవనాలు ఊగుతున్నాయి కనిపించాయి. మెట్రో స్టేషన్లలో ఉన్న రైళ్లు కూడా ఊగుతున్నట్లు కనిపిస్తున్నాయి. రోడ్లపై ప్రజలు ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నట్లు ఉంది. ఎత్తైన భవన పైకప్పు స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు రోడ్లపై పడుతోంది. చుట్టూ జనం అరుస్తూ పరుగులు పెడుతున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. వందల మంది గాయపడి ఉంటారని తెలుస్తోంది.





















