April 2025 Horoscope 2025: ఏప్రిల్ 2025 మాస ఫలాలు - తెలుగు సంవత్సరాది ఈ రాశులవారికి అన్నీ శుభాలే..ఈ 4 రాశులవారికి వెంటాడే బాధలు!
April 2025 Horoscope: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం అయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఏ రాశులవారికి అనుకూల ఫలితాలు, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయంటే...

Monthly Horoscope for April 2025: ఏప్రిల్ నెల మాస ఫలాలు
మేష రాశి (Aries Monthly Horoscope)
ఏప్రిల్ నెలలో మేష రాశివారికి గ్రహసంచారం అనుకూలంగాలేదు. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి...ఇలా అన్నిరంగాల వారికి నష్టాలు తప్పవు. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు అస్సలు ఊహించని సంఘటనలు జరుగుతాయి. స్నేహతులతో తగాదాలు జరుగుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అనారోగ్య సమస్యలువెంటాడుతాయి.
వృషభ రాశి (Taurus Monthly Horoscope)
వృషభ రాశివారికి ఏప్రిల్ నెల ప్రధమార్థం అత్యంత యోగదాయకంగా ఉంటుంది. అన్ని రంగాలవారు లాభపడతారు. వృత్తి వ్యాపారాలు మీరు ఆశించిన విధంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఈ నెల ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం అంతగా సహకరించదు. అనుకోని విరోధాలుంటాయి. శత్రువులు పొంచి ఉన్నారు జాగ్రత్త.
మిథున రాశి (Gemini Monthly Horoscope)
ఈ నెలలో గ్రహ సంచారం అన్ని విధాలుగా అనుకూల ఫలితాలనే ఇస్తోంది. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. అన్ని రంగాలవారికి మంచి ఫలితాలే ఉన్నాయి. ఇంటా బయటా మీదే పైచేయి అవుతుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. శత్రువులు స్నేహితులుగా మారుతారు. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు శుభవార్త ఉంటారు.
కర్కాటక రాశి (Cancer Monthly Horoscope)
కర్కాటక రాశివారికి గడిచిన నెలల కన్నా ఏప్రిల్లో కొంత ఉపశమనం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థికంగా లాభపడతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల కల ఫలించే సమయం ఇది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
సింహ రాశి (Leo Monthly Horoscope)
సింహ రాశివారికి ఏప్రిల్ ఆరంభంలో అడుగడుగునా అడ్డంకులే. అనుకున్నప్రకారం ఒక్క పని కూడా పూర్తికాదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ప్రమాదం జరిగే సూచనలున్నాయి. అనుకోని వివాదాల్లో తలదూర్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. శత్రువులు పొంచి ఉన్నారు జాగ్రత్త.
కన్యా రాశి (Virgo Monthly Horoscope)
కన్యా రాశివారికి ఏప్రిల్ నెలలో గ్రహసంచారం మిశ్రమ ఫలితాలనిస్తోంది. అన్ని రంగాల వారూ రాణిస్తారు. ఆర్థికంగా అడుగు ముందుకు వేస్తారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వాహన ప్రమాద సూచనలున్నాయి అత్యంత జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంట్లో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి.
తులా రాశి (Libra Monthly Horoscope)
తులా రాశివారికి ఏప్రిల్ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగులు , వ్యాపారులకు ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు కూడా అంతకు మించి అనేలా ఉంటాయి. డబ్బు బాగా ఖర్చవుతుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. ఊహించని సంఘటనలు జరుగుతాయి. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ధైర్యంగా దూసుకెళ్తారు.
వృశ్చిక రాశి (Scorpio Monthly Horoscope)
ఈ రాశివారికి ఏప్రిల్ నెల బాగా కలిసొస్తుంది. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ గురించి చర్చిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బావుంటుంది. గడిచిన నెల కన్నా ఏప్రిల్ అన్నివిధాలుగా అనుకూల సమయం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
ధనుస్సు రాశి (Sagittarius Monthly Horoscope)
ధనస్సు రాశివారికి ఏప్రిల్ నెలలో శుభ ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శత్రులుపై పై చేయి సాధిస్తారు. నూతన పరిచయాలవల్ల లాభపడతారు. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు.
మకర రాశి (Capricorn Monthly Horoscope)
ఏడున్నరేళ్లుగా ఏలినాటి శనితో బాధపడిన మకరరాశివారికి ఈ ఏడాది ఆరంభం బావుంటుంది.ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరి నిముషంలో గట్టెక్కేస్తారు. కుజుడి సంచారం వల్ల అనారోగ్య సమస్యలుంటాయి. తొందరగా అలసిపోతారు. నెలాఖరును శుభకార్యాలు నిర్వహణకు హాజరవుతారు.
కుంభ రాశి (Aquarius Monthly Horoscope)
కుంభ రాశివారికి ఏప్రిల్ నెల అన్ని విధాలుగా యోగకాలమే. వృత్తి వ్యాపారాలంలో మెరుగుపడతారు.అనారోగ్య సమస్యలు సమసిపోతాయి. ఆర్థికంగా లాభం ఉంటుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు వేసుకుంటారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు.
మీన రాశి (Pisces Monthly Horoscope)
ఏప్రిల్ నెల ఆరంభం మీన రాశివారికి ఇబ్బందులు తప్పవు. శారీరకంగా అలసిపోతారు. బంధుమిత్రులతో విరోధాలు ఉంటాయి. మాటలు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. వాహన ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త. ఈనెలలో మూడు, నాలుగు వారాలు కొంత ఉపశమనం ఉంటుంది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















