Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Nara Lokesh : అవార్డుల కోసం కుటుంబసభ్యులతో పోటీ పడటం కష్టంగా ఉందని నారా లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో తల్లిదండ్రులతో పాటు భార్యాకుమారుడికి కూడా ప్రతిష్టాత్మక అవార్డులొచ్చాయి.

Nara Lokesh On Family Awards: నారా లోకేష్ తన కుటుంబ సభ్యుల విజయాలను ఉద్దేశిస్తూ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థులతో పోరాడటం కంటే, తన ఇంట్లోని విజేతలతో పోటీ పడటమే అత్యంత కఠినమైన సవాలుగా మారిందని ఆయన పేర్కొన్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ సభ్యుల ప్రతిభను, వారు అందుకుంటున్న ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రస్తావిస్తూ చేసిన భావోద్వేగ స్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. అటు తండ్రి, ఇటు భార్య, అటు తల్లి.. చివరకు కుమారుడు కూడా తనదైన శైలిలో రాణిస్తుండటంతో "ఈ పోటీని తట్టుకోవడం నా వల్ల కావట్లేదు" అంటూ ఆయన చమత్కరించారు.
లోకేష్ తన పోస్ట్‌లో ఒక్కొక్కరి గురించి ఈ విధంగా పేర్కొన్నారు తండ్రి చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త సునీల్ భారతి మిట్టర్ నేతృత్వంలోని జ్యూరీ చంద్రబాబును ఈ అవార్డుకు ఎంపిక చేసింది. గతంలో చాలా డాక్టరేట్లను చంద్రబాబు తిరస్కరించినా ఈ పురస్కారాన్ని మాత్రం తీసుకుకనేందుకు అంగీకరించారు. [
I thank @EconomicTimes for naming me ‘Business Reformer of the Year’ at the ET Awards for Corporate Excellence. This recognition reflects the immense potential of Andhra Pradesh and the hard work of its people, as much as the efforts I have made to unlock it. It is a strong…
— N Chandrababu Naidu (@ncbn) December 18, 2025
తల్లి నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ తరపున ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్ పీకాక్’ అవార్డును అందుకున్నారు. లండన్ లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమానికి చంద్రబాబు కూడా హాజరయ్యారు. నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి భారతదేశపు 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' జాబితాలో నిలిచారు. గత వారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. వీరితో పాటు తన తనయుడు దేవాన్ష్ కూడా తక్కువ తినలేదని, తను కూడా చెస్ ఛాంపియన్‌గా అవతరించాడని లోకేష్ గర్వంగా ప్రకటించారు. దేవాన్షన్ చెస్ ఆటలో పలు రికార్డులు ఇప్పటికే సృష్టించారు.
I’m deeply honored to be recognised at the Business Today ‘Most Powerful Women in Business’ Awards in Mumbai last evening. Leadership to me is about building institutions that last, that create value responsibly, and empower people along the way. Thank you @business_today for… pic.twitter.com/bu8qikVX5l
— Brahmani Nara (@brahmaninara) December 13, 2025
"మా ఇంట్లో పోటీ తరతరాలుగా సాగుతోంది. నిజం చెప్పాలంటే, ఎన్నికల్లో పోటీ చేయడం కంటే నా కుటుంబ సభ్యులతో పోటీ పడటమే నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది!" అని లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు.
On popular demand, I must disclose this too: our son Devaansh is also a chess champion. The competition is across generations! https://t.co/LyeoRglHgs
— Lokesh Nara (@naralokesh) December 18, 2025
రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే లోకేష్, తన కుటుంబ సభ్యుల విజయాలను ఓ సామాన్యుడిలా ఆస్వాదించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "పర్ఫెక్ట్ ఫ్యామిలీ గోల్స్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





















