Ugadi Rasi Phalalu 2025 to 2026 : ఈ రాశుల రాజకీయనాయకులకు పదవీ యోగం.. ఆ రాశులవారికి పదవీ గండం, ఖర్చులు తప్పవు!
Ugadi Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ రాశుల రాజకీయ నాయకులకు ఎలాంటి ఫలితాలున్నాయి. ఎవరికి పదవీ యోగం ఎవరికి పదవీ గండం..

Ugadi Rasi Phalalu 2025 to 2026 in Telugu
మేష రాశి
మేష రాశి రాజకీయనాయకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గురుబలం ఉంటుంది. శని కూడా అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఉన్నతస్థాయి అధికారులతో సఖ్యత ఉంటుంది. ప్రజల్లో మంచి పేరుంటుంది. డబ్బు మాత్రం మంచినీళ్లలా ఖర్చవుతుంది. పదవికోసం ఆశపడేవారికి ఏదో ఒక పదవి లభిస్తుంది
వృషభ రాశి
ఈ రాశి రాజకీయ నాయకులకు ఉగాది తర్వాత నుంచి అద్భుతంగా ఉంటుంది. ఉన్నతాధికారుల అనుగ్రహం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఎదురుచూపులు ఫలిస్తూ నామినేటెడ్ పదవులు దక్కుతాయి. అధిష్టానం నుంచి గౌరవం పొందుతారు. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
మిథున రాశి
మిథున రాశి రాజకీయ నాయకులుకు ఈ ఏడాది ప్రజాదరణ పెరుగుతుంది. అధిష్టాన వర్గంతో స్నేహ సంబంధాలుంటాయి. పదవికోసం ఎదురుచూస్తున్నవారు గుడ్ న్యూస్ వింటారు. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. భారీగా డబ్బు ఖర్చు చేస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి రాజకీయ నాయకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అధిష్టానం నుంచి ప్రశంసలు పొందుతారు. ఏదో పదవి తప్పకుండా పొందుతారు. ప్రజాదరణ ఉంటుంది. ఎన్నికల్లో పోటీచేస్తే శుభ ఫలితం పొందుతారు.
సింహ రాశి
సింహ రాశి రాజకీయ నాయకులకు ఈ ఏడాది అంత యోగకాలం కాదు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి కానీ ఎలాంటి ఫలితం లభించదు. నామనేటెడ్ పదవులు ఆశించినా భంగపాటు తప్పదు. మీకు అనుకున్న పదవి కూడా ఆఖరి క్షణంలో వేరొకరికి వెళ్లిపోతుంది.
కన్యా రాశి
రాజకీయ నాయకులకు శ్రీ విశ్వావసు నామసంవత్సరంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. మీ సేవలకు తగినంత గుర్తింపు లభిస్తుంది. పదవి కోసం ఎదురుచూసేవారి నిరీక్షణ ఫలిస్తుంది. ఖర్చు అవుతుంది కానీ అనుకున్నది జరుగుతుంది.
వృశ్చిక రాశి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ రాశి రాజకీయ నాయకులకు కలసిరాదు. మీపై అధిష్టానంలో మంచి పేరు ఉండదు, ప్రజల్లో అనుకూలత ఉండదు. ఫలితంగా డబ్బు ఖర్చుచేసినా ఫలితం పొందలేరు. మీ మాటతీరు మీకు మైనస్ అవుతుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి రాజకీయ నాయకులకు ఈ ఏడాది ఆహా అనిపించేలా ఉంటుంది. పార్టీకోసం మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు దక్కుతుంది. ఆశించిన పదవి పొందుతారు. ఎన్నికలు జరిగితే మీకు విజయం తథ్యం.
మకర రాశి
మకర రాశివారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో భారీగా ఖర్చు అవుతుంది కానీ అనుకున్నది సాధిస్తారు. ప్రజల్లో మీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ఏదో ఒక పదవి పొందుతారు. ప్రభుత్వ పరంగా గుర్తింపు లభిస్తుంది
కుంభ రాశి
రాజకీయాల్లో ఉండే కుంభరాశి వారికి ఈ ఏడాది మంచిఫలితాలు ఉ్ననాయి. ప్రజల్లో ఆదరణ, అధిష్టానం నుంచి ప్రశంసలు లభిస్తాయి. నామినేటెడ్ పదవులు లభించే అవకాశం ఉంది.
మీన రాశి
మీన రాశి రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రజల్లో మీకు మంచి పేరుంటుంది. అధిష్టానవర్గంలో మీపై మంచి అభిప్రాయం ఉంటుంది. కానీ పార్టీలో మీ చుట్టూ ఉండేవారే మీకు రావాల్సిన పదవులను అడ్డుకుంటారు. ఎన్నికల్లో పోటీచేసినా పెద్దగా మెజార్టీ రాదు
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి





















