అన్వేషించండి

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?

SIT On Tappig Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ నియమించడం హాట్ టాపిక్ గా మారింది. 21 నెలలుగా సాగించిన దర్యాప్తుోల ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

Telangana phone tapping case:   జూన్ 2024లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సాధారణ పోలీస్ విచారణగా సాగుతున్న ఈ కేసును మరింత లోతుగా, పారదర్శకంగా విచారించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి  వీసీ సజ్జనార్ నేతృత్వంలో  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
  
ఈ కేసును హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, దర్యాప్తులో వేగం తగ్గడం, కీలక సూత్రధారులను పట్టుకోవడంలో జాప్యం జరగడంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేవలం కొంతమంది అధికారుల అరెస్టుతోనే ప్రక్రియ ఆగిపోయిందని, అసలైన రాజకీయ కోణాన్ని వెలికితీయడంలో ఇప్పటివరకు జరిగిన విచారణ సరిపోలేదని భావించిన సర్కార్, ఈ బాధ్యతను సజ్జనార్‌కు అప్పగించింది. 

తాజాగా నియమితులైన సిట్  ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న రాజకీయ పెద్దలెవరు? అనే కోణంలో సిట్ విచారణ జరుపుతుందని భావిస్తున్నారు.  నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల సహాయంతో ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలను ఎలా వాడారు? అనేది నిగ్గు తేల్చనుంది.  ఎస్ఐబీ (SIB) కార్యాలయంలో సాక్ష్యాలను మాయం చేసేందుకు ధ్వంసం చేసిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌ల నుంచి డేటాను రీట్రీవ్ చేయడంపై దృష్టి పెట్టనుంది. హవాలా మార్గాల్లో నగదు రవాణాకు మరియు ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల ఫోన్లను ట్రాక్ చేయడానికి ఈ వ్యవస్థను ఎలా ఉపయోగించుకున్నారో సిట్ ఆధారాలు సేకరిస్తుంది.
  
వివాదాస్పద, క్లిష్టమైన కేసులను ఛేదించడంలో సీనియర్ అధికారి వీసీ సజ్జనార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. టెక్నాలజీపై అవగాహన ఉండటంతో పాటు, కఠినమైన అధికారిగా ఆయనకున్న ఇమేజ్ ఈ కేసులో బాధితులకు నమ్మకాన్ని కలిగిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆయనకు సహకరించేందుకు మరికొందరు దక్షత కలిగిన అధికారులను కూడా ఈ బృందంలో చేర్చారు. నిందితులను అరెస్టు  చేసి చాలా రోజులు జైల్లో పెట్టారు. ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించి ప్రశ్నించారు. అయితే ఈ కేసులో ఆధారాలేమీ లభించడండ లేదని తెలుస్తోంది. అందుకే  సజ్జనార్ రంగంలోకి దింపారని భావిస్తున్నారు. సిట్ రంగంలోకి దిగిన తర్వాత ఈ కేసులో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.  

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారని అప్పటి విపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సహా చాలా మంది ఆరోపణలు చేశారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక..  ఇంటలిజెన్స్ విభాగంలో అత్యంత సున్నితమైన డేటా కనిపించుకండా పోవడంతో విచారణ చేపట్టారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.   కానీ ఆధారాలు సేకరించడంలో పోలీసులు సక్సెస్ లేకపోవడంతో సిట్ కు కేసును అప్పగించాలని చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.                                      

టాప్ హెడ్ లైన్స్

El Nino Effect: వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
KBR Park Elevated Corridors: కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget