అన్వేషించండి

Harish Rao kindness: పేద విద్యార్థి విద్యారుణం కోసం తన ఇల్లు ష్యూరిటీ పెట్టిన హరీష్ రావు - ఇలాంటి నేతలుంటారా?

Harish Rao: హామిలిచ్చే రాజకీయ నేతలు ఉంటారు. కానీ అవి తీర్చేందుకు ఇంటిని తాకట్టు పెట్టేవారు కొందరే ఉంటారు. వారిలో ఒకరు హరీష్ రావు.

Harish Rao used his house as collateral for a poor student education loan : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఉదారతను చాటుకున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. పేద విద్యార్థుల చదువు కోసం రాజకీయ నాయకులు సాయం చేయడం చూస్తుంటాం, కానీ  ఒక విద్యార్థిని భవిష్యత్తు కోసం తన సొంత ఇంటినే బ్యాంకులో తాకట్టు పెట్టారు  హరీష్ రావు. 

రాజకీయాల్లోనే కాదు, మానవత్వంలోనూ తనకు సాటి లేరని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్నామంటూ తన గడప తట్టిన ఒక సామాన్య టైలర్ కుటుంబానికి ఆయన కొండంత అండగా నిలిచారు. పీజీ వైద్య విద్య  చదవాలని కలలు కంటున్న ఆ యువతికి ఆర్థిక కష్టాలు అడ్డురాగా, ఆమె కల నెరవేర్చడానికి హరీశ్ రావు ఏకంగా తన సొంత ఇంటినే బ్యాంకులో హామీగా పెట్టి విద్యా రుణం ఇప్పించారు. 
 
సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ఓ టైలర్ కుమార్తె కష్టపడి చదివి మెడిసిన్ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం పీజీలో సీటు సంపాదించినప్పటికీ, భారీ ఫీజులు చెల్లించడం ఆ కుటుంబానికి భారంగా మారింది. చేతిలో చిల్లిగవ్వ లేక, బ్యాంకుల్లో లోన్ పుట్టక ఆ విద్యార్థిని చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ కుటుంబం తమ ఎమ్మెల్యే హరీశ్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకుంది.
 
సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఎవరైనా సిఫార్సు లేఖలు ఇస్తారు, కానీ హరీశ్ రావు  ఆ యువతి ప్రతిభను గుర్తించి, ఎలాగైనా ఆమెను ఉన్నత విద్యావంతురాలిని చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యా రుణం రావడానికి సెక్యూరిటీ సమస్యగా మారడంతో, ఏమాత్రం సంకోచించకుండా  తన సొంత ఇంటి డాక్యుమెంట్లను బ్యాంకులో హామీగా  పెట్టారు.** తద్వారా సుమారు రూ. 20 లక్షల రుణం ఆ విద్యార్థినికి అందేలా చేశారు.        

 
కేవలం లోన్ ఇప్పించడమే కాకుండా, తక్షణ అవసరాల కోసం తన వ్యక్తిగత ఖాతా నుంచి  రూ. 1 లక్ష నగదును  కూడా ఆ కుటుంబానికి అందజేశారు.   బాగా చదువుకుని సమాజానికి సేవ చేయాలాని ఆ విద్యార్థినికి భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధి అంటే కేవలం ఓట్లు వేయించుకోవడం మాత్రమే కాదు, ప్రజల కష్టాల్లో భాగస్వామి కావాలని ఆయన నిరూపించారు. తన నియోజకవర్గ ప్రజలను సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నారు హరీష్ రావు.  ఒక సామాన్య టైలర్ బిడ్డ డాక్టర్ కావాలనే ఆశయానికి తన ఇంటినే తాకట్టు పెట్టిన హరీశ్ రావు  నియోజకవర్గ ప్రజల దృష్టిలో మరింతగా ఇమేజ్ పెంచుకున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
TPCC Showcause Notice: టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?
టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?

వీడియోలు

JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget