అన్వేషించండి

Prakash Goud Son Santosh Goud Allegations: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు

Rajendranagar MLA Prakash Goud Family Dispute: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌పై ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రేమ వివాహంపై వివాదం జరుగుతోంది.

Narsingi Police Case Santosh Goud: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ నియోజకవర్గం  ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌పై ఆయన   కుమారుడు సంతోష్ గౌడ్ తీవ్రస్థాయిలో  ఆరోపణలు చేశారు. తన ప్రేమ వివాహాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా తండ్రే తనపై, తనకు అండగా నిలిచిన వారిపై దాడులు చేయిస్తున్నారని సంతోష్ గౌడ్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న సొంత తండ్రిపైనే కుమారుడు  ఫిర్యాదు చేయడంతో రాజకీయ వర్గాల్లో  కలకలం రేగింది.

బాధితుడు సంతోష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రూపా రెడ్డి కుమార్తెను వివాహం చేసుకోవాలని తాను నిశ్చయించుకున్నప్పటి నుంచి కుటుంబంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల మణికొండలోని రూపా రెడ్డి నివాసానికి కొందరు అపరిచిత వ్యక్తులు వచ్చి భయాందోళనలు సృష్టిస్తూ గొడవకు దిగారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక పూర్తిగా తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తమే ఉందని, ఆస్తి వివాదాలు,  అంతర్గత మనస్పర్థల కారణంగానే ఈ రకమైన దాడులు చేయిస్తున్నారని సంతోష్ ఆరోపించారు.

ఘటన జరిగిన వెంటనే తాము ప్రాణభయంతో డయల్-100కు కాల్ చేసి అత్యవసర సమాచారం అందించినప్పటికీ, నార్సింగ్ పోలీసులు స్పందించిన తీరుపై సంతోష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదును పోలీసులు సరిగా స్వీకరించకపోగా, శాసనసభ్యుడి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఉల్టా తమపైనే అక్రమ కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారని ఆయన విమర్శించారు. మీడియా ముందుకు వచ్చి నిజాలు బయటపెట్టినందున ప్రస్తుతం తమ ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై బాధితురాలు రూపా రెడ్డి  ఇది ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. తమపై తప్పుడు ఆరోపణలతో కేసులు మోపి జైలుకు పంపించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. తాము చట్టబద్ధంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రశాంతంగా జీవించే తమ కుటుంబానికి ఈ రకమైన వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. రాజేంద్రనగర్ శాసనసభ్యుడి ఇంట్లో తలెత్తిన ఈ అంతర్గత వివాదం  వైరల్ అవుతోంది. అయితే, తన కుమారుడు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్  భిన్నంగా స్పందించారు.

వాడెవడో తనకు తెలియదని..తనకు సంబంధం లేదని ప్రకాష్ గౌడ్ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై తాను సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని అన్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakash Goud Son Santosh Goud Allegations: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget