అన్వేషించండి

Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

Janasena: పవన్ కల్యాణ్ జనసేన ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశం అవుతున్నారు. వారి పనితీరుపై సమీక్షించి సూచనలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

Pawan Meets Jana Sena MLAs: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  ఎమ్మెల్యేలతో ముఖాముఖి  సమావేశాలు నిర్వహించారు. వారి పనితీరుపై అందిన నివేదికల ఆధారంగా సమీక్షించినట్లుగా తెలుస్తోంది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆయన ఈ సమీక్షలు చేపట్టినట్లు జనసేన వర్గాలుచెబుతున్నాయి. 

రోజంతా పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలకు పవన్ కల్యాణ్ ప్రాధాన్యం           

జనసేన పార్టీ శాసనసభ్యుల పనితీరుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఉదయం నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అవుతూ, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు.  ఒక్కో ఎమ్మెల్యేతో దాదాపు 30 నిమిషాలకు పైగా  సమయం గడుపుతూ, క్షేత్రస్థాయిలో అందుతున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా  పలు రకాల సమస్యలపై వారితో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వారికున్న ఇమేజ్,   కూటమి పార్టీలతో సమన్వయంపై ముందస్తుగానే సమగ్ర రిపోర్ట్స్ తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికల ఆధారంగానే  ఎమ్మెల్యేలతో పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.           

ఎమ్మెల్యే పనితీరుపై సుదీర్ఘ సమీక్ష                     

నియోజకవర్గాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిని సమీక్షించారు.  పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే అంశంపై ఆరా తీశారు.  కూటమి పార్టీల నేతలతో సఖ్యత , స్థానిక సమస్యల పరిష్కారంపై ఎంతవరకు దృష్టి పెట్టారనేది ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఈ సమీక్షల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై  పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలోనే కొందరు నేతల వ్యవహారశైలిపై వచ్చిన ఫిర్యాదులను ఆయన తీవ్రంగా పరిగణించారు.         

కీలక సూచనలు చేసిన పవన్ - కొంత మంది ఎమ్మెల్యేల తీరుపై అసంతృృప్తి                  

 పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించినా, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోకపోయినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. పనితీరు మెరుగుపరుచుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని పరోక్షంగా సంకేతాలిచ్చారని అంటున్నారు. మొదటగా మండలి బుద్ధప్రసాద్‌తో ప్రారంభమైన ఈ వన్ టు వన్ భేటీలు, ఆ తర్వాత దేవ వరప్రసాద్, లోకం నాగ మాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సీహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబు,  సుందరపు విజయ్ కుమార్‌లతో కొనసాగాయి. గెలిచిన వారందరూ కేవలం చట్టసభలకు పరిమితం కాకుండా, కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా జనంలో ఉండాలని పవన్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.                                      

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget