Chandrababu Delhi tour: ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుస సమావేశాలు - నిధుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చలు
AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.

Chandrababu Naidu Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అత్యంత బిజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన ఒక్కరోజే ఆరుగురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. విభజన హామీలు, పెండింగ్ నిధులు, మరియు కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కేంద్రంతో ఆయన జరుపుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నాయి.
శుక్రవారం ఉదయం నుంచే ఆయన వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై వినతులు సమర్పిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
ముందుగా కేంద్ర జల్‌శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల వేగవంతం, నిధుల విడుదలపై చర్చించారు. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, దీనివల్ల ఏపీకి జరిగే నష్టాన్ని కేంద్రానికి వివరించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అదనపు నిధుల కోసం ఆర్థిక మంత్రితో చర్చలు జరిపారు. సాస్కీ పథకం కింద రెండో విడతగా రూ. 10,054 కోట్లు మంజూరు చేయాలని, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు రూ. 41 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఆర్థిక చేయూతనివ్వాలని కోరారు.
కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్రంలో నూతన షిప్పింగ్ ప్రాజెక్టులు, మేజర్ ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధిపై చర్చించారు. కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో ఏపీ తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఎలా బలోపేతం చేయవచ్చో వివరించారు.
Delighted to meet the Hon’ble Union Finance Minister, Smt. Nirmala Sitharaman Ji, in New Delhi today. With the support of Central initiatives such as Purvodaya, Andhra Pradesh has the potential to emerge as a major growth engine for eastern India. I also requested funding support… pic.twitter.com/Jd9qAitdpE
— N Chandrababu Naidu (@ncbn) December 19, 2025
బీజేపీ కొత్త జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ సిన్హాను కూడా చంద్రబాబు కలిసి అభినందించారు.
Met the newly appointed National Working President of the Bharatiya Janata Party, Shri Nitin Nabin Ji, and extended my best wishes to him on assuming his new role.@NitinNabin pic.twitter.com/GzC9kcMSgE
— N Chandrababu Naidu (@ncbn) December 19, 2025
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో విభజన సమస్యలు, శాంతి భద్రతల అంశాలపై చర్చించనున్నారు. నితిన్ గడ్కరీ జాతీయ రహదారుల విస్తరణ, రాష్ట్రంలో కొత్త హైవేల మంజూరుపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన ముగించుకుని చంద్రబాబు నాయుడు ఇవాళే అమరావతికి తిరిగి చేరుకుంటారు. శనివారం అనకాపల్లి జిల్లాలో జరిగే స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని, అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.





















