అన్వేషించండి

Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్

Diversity Visa: అమెరికా పౌరసత్వం కోసం వేచి ఉన్న లక్షలాది మందికి ట్రంప్ హైవోల్టేజ్ షాక్ ఇచ్చారు. డైవర్సిటీ వీసా లాటరీని నిలిపేస్తున్నట్లుగా ప్రకటించారు.

Trump suspends Green Card lottery Diversity Visa Program:  అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనుకునే వేలాది మంది విదేశీయుల కలలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఏటా సుమారు 55,000 మంది విదేశీయులకు గ్రీన్ కార్డులు అందించే ప్రతిష్టాత్మక  డైవర్సిటీ వీసా (DV) లాటరీ  ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తున్నట్లు  వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికాలోకి వలసలను నియంత్రించడంతో పాటు, మెరిట్ ఆధారిత వలస విధానాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

 ఏమిటీ డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్? 

అమెరికాకు వలస  వచ్చే వారిలో అంతా ఒకే రకమైన వారు ఉండకుండా  వైవిధ్యం  పెంచేందుకు 1990 నుండి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అమెరికాకు తక్కువ సంఖ్యలో వలస వెళ్లే దేశాల పౌరులకు ఈ లాటరీ పద్ధతి ద్వారా ఏటా 55,000 గ్రీన్ కార్డులను కేటాయించేవారు. ఎటువంటి ప్రత్యేక నైపుణ్యాలు లేకపోయినా, కేవలం అదృష్టం బాగుండి లాటరీ తగిలితే అమెరికాలో స్థిరపడే అవకాశం ఉండటంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండేది.

మిగిలిన వీసాలపై ప్రభావం ఎలా ఉంటుంది?

డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌ను నిలిపివేసినప్పటికీ, ఆ విభాగంలో మిగిలిపోయే వీసాలు ఇతర కేటగిరీలకు ఉద్యోగ లేదా కుటుంబ ఆధారిత వీసాలకు కలపరు.  ప్రస్తుత చట్టాల ప్రకారం, ఈ ప్రోగ్రామ్ కింద కేటాయించిన 55,000 వీసాలు రద్దయితే, ఆ సంఖ్య  ఆటోమేటిక్గా మెయిన్ గ్రీన్ కార్డ్ పూల్‌లో కలవదు.  అంటే, ఉపాధి ఆధారిత లేదా కుటుంబ ఆధారిత వీసాల కోసం వేచి ఉన్న వారికి దీని వల్ల అదనపు కోటా లభించే అవకాశం లేదు. 

నేరాలకు పాల్పడుతున్న డైవర్సిటీ వీసా గ్రీన్ కార్డు హోల్డర్లు

ఈ డైవర్సిటీ వీసా లాటరీ వల్ల దేశంలోకి వచ్చేవారికి ఎలాంటి నైపుణ్యాలు ఉండటం లేదు.  పైగా నేరాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల బ్రౌన్ యూనివర్శిటీ లో కాల్పులు జరిపిన వ్యక్తి డైవర్సిటీ వీసా ద్వారానే దేశంలోకి వచ్చారు. 

 జాతీయ భద్రతను పటిష్టం చేయడంలో భాగంగానే ఈ లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్  ప్రభుత్వం ప్రకటించింది.  ఎటువంటి తనిఖీలు లేకుండా అదృష్టం కొద్దీ వచ్చే వారి కంటే, దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే నైపుణ్యం కలిగిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా భావిస్తోంది. సాధారణంగా భారతీయులు ఈ డైవర్సిటీ వీసా రేసులో ఉండరు. ఎందుకంటే భారత్ నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు ఉన్నాయి . కానీ, మొత్తం గ్రీన్ కార్డ్ వ్యవస్థలో వస్తున్న మార్పుల వల్ల పరోక్షంగా నిబంధనలు మరింత కఠినతరం అయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  

 

టాప్ హెడ్ లైన్స్

US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
ఇజ్రాయెల్ ఎన్నికలు 2026: నెతన్యాహు కోట కూలుతుందా? జ్యోతిష్య సూచనలు!
ఇజ్రాయెల్ ఎన్నికలు 2026: నెతన్యాహు కోట కూలుతుందా? జ్యోతిష్య సూచనలు!
US Iran Tensions: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
US Iran Tensions: ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sachin -Sooryavanshi Critique: 15 ఏళ్ల వైభ‌వ్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంపై సచిన్ అసంతృప్తి.. జో రూట్ టెస్ట్ రికార్డు వేటపై ఆసక్తికర వ్యాఖ్యలు
15 ఏళ్ల వైభ‌వ్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంపై సచిన్ అసంతృప్తి.. జో రూట్ టెస్ట్ రికార్డు వేటపై ఆసక్తికర వ్యాఖ్యలు, వన్డే ఫార్మాట్ మార్పులకు పిలుపు
Prakasam Boat Capsized Dead Bodies: కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
Embed widget