కాశీ

పునర్జన్మ లేకుండా మోక్షాన్నిచ్చే క్షేత్రం ఇది!

Published by: RAMA

ఓం శూలపాణయే నమః

దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీ..ఇక్కడ కొలువైంది విశ్వేశ్వర జ్యోతిర్లింగం

ఓం ఖట్వాంగినే నమః

ఈ క్షేత్రంలో స్నానం, దానం, హోమం చేసిన వారికి మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసం

ఓం విష్ణువల్లభాయ నమః

మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరం అయిన వారణాసి..భూమి కన్నా ముందే పుట్టిందని పురాణ కథనం

ఓం శిపివిష్టాయ నమః

త్రిశూలంపై శివుడు సృష్టించిన భాగంలో బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు..

ఓం అంబికానాథాయ నమః

దేవతలు, రుషుల విజ్ఞప్తి మేరకు త్రిశూలంపై బ్రహ్మ కూర్చున్న భాగాన్ని కిందకు దించగా అదే కాశీగా మారింది

ఓం భక్తవత్సలాయ నమః

భూమిమొత్తం నీరు నిండి ఉన్న సమయంలో మొదటి భూభాగం కాశీ..అందుకే భూమి కన్నా కాశీ ముందు పుట్టిందంటారు

ఓం భవాయ నమః

సృష్టి మొత్తం నాశనం అయినా కాశీ మాత్రం చెక్కుచెదరదు అంటారు..

ఓం శర్వాయ నమః

కాశీ క్షేత్రంలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ స్పష్టత లేదు..

ఓం త్రిలోకేశాయ నమః

వారణాసిలో 72 వేల ఆలయాలు ఉండేవనీ యోగశాస్త్రం ప్రకారం ఇది మనిషి శరీరంలోని నాడుల సంఖ్యతో సమానం అని చెబుతారు