మహాశివరాత్రి, ప్రతిసోమవారం సాయంత్రం పఠించాల్సిన స్తోత్రం ఇది!

శివుడు ప్రసన్న వదనంతో ఆనంద తాండవం చేసే ప్రదోష సమయంలో ఈ స్త్రోత్రం పఠించాలి

కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే

నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా

విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా
సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ

యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః

ఇదే ప్రదోష స్తోత్రం...మహాశివరాత్రి, సోమవారాలే కాదు నిత్యం సాయంత్రం సమయంలో పఠిస్తే శుభం జరుగుతుంది