ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మూడోది

'మహాకాలుడు' - భస్మాభిషేకం ఇక్కడే!

Published by: RAMA

ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉన్న మహాకాళ లింగాన్ని మహాకాళేశ్వర్ అంటారు

ఓం సామప్రియాయ నమః

ప్రాచీన సాహిత్యంలో ఉజ్జయినిని అవంతికపురి అని పిలుస్తారు

ఓం స్వరమయాయ నమః

క్షిప్రానది ఒడ్డున ఉన్న ఉజ్జయిని నగరంలో వందకు పైగా చిన్న దేవాలయాలుంటాయి

ఓం త్రయీమూర్తయే నమః

7 సాగర తీర్థాలు, 28 తీర్థాలు, 84 సిద్ధ లింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు..

ఓం అనీశ్వరాయ నమః

ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండం ఉన్నాయి

ఓం సర్వజ్ఞాయ నమః

ఈ ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, శ్రీ చక్రయంత్రం తిరగేసి ఉండడం ఇక్కడి విశిష్టత

ఓం పరమాత్మనే నమః

కింద మ‌హా కాళ లింగం, మధ్య అంతస్తులో ఓంకార లింగం, పైన నాగేంద్ర లింగం దర్శించుకోవచ్చు

ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః

ఈ ఆలయంలో మహా కాళేశ్వరుడికి వేకువజామునే భస్మాభిషేకం చేస్తారు

ఓం యజ్ఞమయాయ నమః

కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు..ఇక్కడ స్వామిని ద‌క్షిణామూర్తి అని కూడా అంటారు