ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటది సోమేశ్వర లింగం గురించి ఈ విషయాలు తెలుసా!
సరస్వతీ నది సాగర సంగమం చేసే ప్రదేశం ప్రభాస పట్టణంలో ఉందీ ఆలయం
యదువంశానికి ముగింపు పలికిన తర్వాత శ్రీకృష్ణుడు మోక్షాన్ని పొందిన ప్రదేశం ఇదే
ఈ సాగర సంగమంలోనే చంద్ర భగవానుడు స్నానం ఆచరించి శివారాధన చేసి, శాప విముక్తి పొందాడు
దక్ష ప్రజాపతి కుమార్తెల్లో అందరికన్నా పెద్దది సతీదేవి..ఆమె శివుని భార్య
మిగిలిన కుమార్తెల్లొ 27 మందిని (అశ్విని, భరణి ..రేవతి నక్షత్రములు) చంద్రునుకి ఇచ్చి వివాహం చేశాడు
రేవతిపై తప్ప మిగిలినవారిని పట్టించుకోపోవడంతో వాళ్లంతా తండ్రి దక్ష ప్రజాపతి చెప్పుకుని బాధపడతారు
క్షయ వ్యాధిని పొందు అని చంద్రుడికి దక్షప్రజాపతి ఇచ్చిన శాపానికి నారదుడు చెప్పిన విమోచనం సోమేశ్వర లింగం
వర ప్రభావంతో 15 రోజులు వెలుగు పెరుగుతుంది..శాప ప్రభావంతో 15 రోజులు వెలుగు తగ్గుతుంది
ఈ సోమేశ్వర లింగాన్ని దర్శించుకుని పూజిస్తే సకల పాపాలు క్షయం అవుతాయని భక్తుల విశ్వాసం