చాణక్య నీతి: కోకిల కూత - కాకిగోల .. మీ తీరేంటో మీకు తెలుసా!

మనిషి మాటతీరు వారి గుణగణాలని చెప్పేస్తుందని శిష్యులకు బోధించారు ఆచార్య చాణక్యుడు

తపన్మౌనేన నీయుక్తే కోకిలశ్చైవ వానరాః
యావతసర్వం జనానష్టదాయినీ వాఢం న ప్రవర్తతి

ఈ శ్లోకం ద్వారా కోకిల - కాకి మధ్య వ్యత్యాసాన్ని చెబుతూ స్పష్టంగా వివరించారు

గొంతులోంచి మధుర స్వరం పలకలేను అనుకున్నంతకాలం కోకిక మౌనంగానే ఉండిపోతుంది

వసంతకాలం వచ్చేవరకూ ఆగి..అప్పుడు తన స్వరంతో అందర్నీ మురిపిస్తుంది

సీజన్ ఏదైనా కానీ ఎలాంటి సంబంధం లేకుండా కాకి అరుస్తూనే ఉంటుంది

అందుకే కాకి గోల అనే పదం వాడతారు కానీ కోకిల గోల అనరు..అనలేరు

అంటే మాట్లాడే విధానం కోకిలలా మధురంగా ఉండాలని చెప్పడమే చాణక్యుడి ఆంతర్యం