పంచామృతాలు శివుడి కోసం కాదు..మీ ఆరోగ్యం కోసం!
ఆవు పాలు, పెరుగు, నెయ్యి, నీళ్లు, తేనె
శివుడికి చేసే ప్రత్యేక పూజలో అభిషేకం తప్పనిసరి..ఇందులో భాగంగా పంచామృతాలు వినియోగిస్తారు
పంచామృతాల్లో వినియోగించే ఐదు పదార్థాల్లో ఒక్కో దాంట్లో ఒక్కో ఆరోగ్య ప్రయోజనం ఉందని మీకు తెలుసా
ఆవుపాలు అమ్మపాలతో సమానమైనవి...త్వరగా జీర్ణం అవుతాయి, వీటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది
శరీరంలో వాత దోషాన్ని తగ్గిస్తుంది పెరుగు. శివయ్యకు అభిషేకం చేసేందుకు ఆవుపాలతో తోడు పెట్టిన పెరుగునే వినియోగిస్తారు
తేనెలో ఉండే ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు..దీర్ఘాష్షును ఇస్తుంది తేనె
మేథోశక్తిని, శరీరంలో మెరుపును అందిస్తుంది ఆవు నెయ్యి..ఇందులో ఎన్నో పోషక విలువలున్నాయి
జీవితం సంతోషంగా, తియ్యగా సాగిపోవాలని ప్రార్థిస్తూ శివుడికి పంచామృతాల్లో భాగంగా పంచదారతో అభిషేకం చేస్తారు