మాఘ పౌర్ణమికి సముద్ర స్నానం ఎందుకు
నదులన్నీ చివరకు కలిసేది సముద్రంలోనే అని అర్థం.
మాఘ పౌర్ణమిరోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల నదుల్లో స్నానమాచరించిన ఫలితం దక్కుతుంది
నిత్యం సూర్యకిరణాలవల్ల ఎంత నీరు ఆవిరవుతున్నా సముద్రం పరిమాణం తగ్గదు
ఎన్నో జీవరాశులు తనలో కలుస్తున్నా పరిమాణం పెరగదు..
ఏం జరిగినా.. వాతావరణంలో మార్పులొచ్చినా సముద్రుడిలో మార్పులు ఉండవు
జీవితంలో స్థిరత్వాన్ని, ఆటుపోట్లకు తలొగ్గని తత్వాన్ని ఇమ్మని ప్రార్థిస్తూ సముద్ర స్నానం చేస్తారు
ఏడాదిలో నాలుగు పౌర్ణమిలకు సముద్ర స్నానం ఆచరించాలంటారు
ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి
సముద్ర స్నానం చేస్త సంపూర్ణ ఆరోగ్య, ఆయుష్షు సిద్ధిస్తుందని పురాణాల్లో ఉంది