శ్రీ వేంకటేశుడి వైభోగం మాటల్లో కాదు ఈ దృశ్యాల్లో చూడండి!
తిరుమల మాడవీధులు గోవింద నామస్మరణలో మారుమోగాయి..
రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు
ఒకే రోజు ఏడు వాహన సేవలు చూసే భాగ్యం దక్కించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు
సూర్య జయంతి సందర్భంగా మొదట సూర్యప్రభ వాహనంతో స్వామివారి వాహనసేవలు ప్రారంభమయ్యాయి
ఆ తర్వాత చిన్న శేషవాహనం, గరుడవాహనం, హనుమంతవాహనంపై మలయప్పస్వామి మాడవీధుల్లో విహరించారు
మధ్యాహ్నం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు..ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు
అందుకే రథసప్తమి ఉత్సవాలను అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం అంటారు
తిరుమల మాడవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయ్..