LSG vs PBKS Match Highlights IPL 2025 | లక్నో పై 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP Desam
సన్ రైజర్స్ ను ఓడించిన ఉత్సహంలో లక్నో సూపర్ జెయింట్స్...గుజరాత్ ను ఓడించిన ఉత్సాహంలో పంజాబ్ కింగ్స్..మరి ఈ రెండు జట్ల మధ్య పోరాటం జరిగితే గెలుపు ఎవరిది. అచ్చం అలాంటి టఫెస్ట్ మ్యాచే కనిపించింది లక్నో, పంజాబ్ జట్ల మధ్య ఈ రోజు జరిగిన మ్యాచ్ లో. కానీ మ్యాచ్ అంతా పంజాబ్ డామినెన్స్ చూపించి 8 వికెట్ల తేడాతో లక్నోకు షాక్ ఇచ్చిన ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. పూరన్ &బడోని షో
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ తమ నిర్ణయం సరైనదే అనిపించేలా బౌలింగ్ అటాక్ తో దుమ్ము రేపింది. మొదటి ఓవర్ నాలుగో బంతికే మిచెల్ మార్ష్..అవుట్ చేసిన అర్ష్ దీప్ పంజాబ్ కి కావాల్సిన ఆరంభం ఇస్తే...మొదట మార్ క్రమ్ తో తర్వాత బడోనితో కలిసి లక్నోను ఆదుకున్నాడు పూరన్. 30 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు పూరన్. మరో వైపు బడోనీ 33 బాల్స్ లో 1 ఫోర్ 3 సిక్సర్లతో 41 పరుగులు చేయటంతో వికెట్ల పతనం నుంచి కాస్త కోలుకుంది.
2. చేతులెత్తేసిన పంత్
ఈ సీజన్ లో 27 కోట్ల రూపాయలకు అమ్ముడై అందరినీ షాక్ కి గురి చేసిన రిషభ్ పంత్ లక్నోకు కెప్టెన్ గా వెళ్లిన తర్వాత బ్యాటర్ గా మాత్రం విఫలం అవుతున్నాడు. వరుసగా మూడో మ్యాచ్ లో సింగిల్ డిజిట్ స్కోర్ కి అవుటై తన పూర్ ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. పంజాబ్ తో మ్యాచ్ లో రెండు పరుగులే చేసి మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో వికెట్ సమర్పించేసుకోవటం నిజంగా లక్నోను భారీగా దెబ్బ తీసింది.
3. అదరగొట్టిన అర్ష్ దీప్
ఈ మ్యాచ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా అర్ష్ దీప్ బౌలింగ్ మాత్రం చాలా బాగుంది. స్టార్టింగ్ లోనే మిచ్ మార్ష్ ను...తర్వాత 41 పరుగులతో నిలదొక్కుకున్న ఆయుష్ బదోని..చివర్లో హిట్టింగ్ తో విరుచుకుపడుతున్న అబ్దుల్ సమద్ వికెట్లు తీసుకున్నాడు అర్ష్ దీప్ సింగ్. మొత్తంగా 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చినా కీలకమైన 3 వికెట్లు తీశాడు. లక్నో బ్యాటర్ అబ్దుల్ సమద్ చివర్లో 12 బాల్స్ లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ కారణంగా పంజాబ్ కు లక్నో కనీసం 172 పరుగుల లక్ష్యమైనా పెట్టగలిగింది.
4. ఫైరీ ప్రభ్ సిమ్రన్ సింగ్
172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ స్టార్టింగ్ లోనే ప్రియాంశ్ ఆర్య వికెట్ ను కోల్పోయినా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో కలిసి దుమ్మురేపాడు ప్రభ్ సిమ్రన్ సింగ్. 34 బాల్స్ లోనే 9 ఫోర్లు 3 సిక్సర్లతో 69 పరుగులు పిండుకున్నాడు. దిగ్వేష్ బౌలింగ్ లో ఔటయ్యాడు కానీ లేదంటే సెంచరీ చేసేంత దూకుడును చూపించాడు ఫైరీ ఫ్రభ్ సిమ్రన్ సింగ్.
5. అయ్యర్ అదరహో..వధీరా సాహో
దూకుడుగా ఆడిన ప్రభ్ సిమ్రన్ అవుటైపోయినా ఆ లోటు తీర్చేలా అయ్యర్ తో కలిసి నేహల్ వధీరా దుమ్ము రేపేశాడు. వీలైనంత త్వరగా టార్గెట్ ఫినిష్ చేయాలని ఈ ఇద్దరూ ఆడిన ఆటతో 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది పంజాబ్. అయ్యర్ 30 బాల్స్ లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో సూపర్ హాఫ్ సెంచరీ సాధించి 52పరుగులు చేస్తే..నేహాల్ వధీరా మాత్రం 25 బాల్స్ లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి పంజాబ్ కు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పంజాబ్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే..లక్నో మూడు ఆడి రెండు ఓడిపోయింది.





















