Vijay Varma: 'ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదిస్తేనే సంతోషం' - తమన్నాతో బ్రేకప్ ప్రచారం వేళ రిలేషన్ షిప్‌పై విజయ్ వర్మ ఏమన్నారంటే?
Tamannaah Vijay Varma: తమన్నాతో బ్రేకప్ వార్తల వేళ బాలీవుడ్ హీరో విజయ్ వర్మ రిలేషన్ షిప్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రతీ విషయాన్ని ఆస్వాదించాలని అన్నారు.

Vijay Varma About Relationship While Breakup Rumours With Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), బాలీవుడ్ హీరో విజయ్ వర్మ (Vijay Varma) మధ్య బ్రేకప్ వార్తలు గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటివరకూ ఇద్దరూ స్పందించలేదు. ఈ క్రమంంలో నటుడు విజయ్ వర్మ తాజాగా రిలేషన్ షిప్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.
'ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదించాలి'
రిలేషన్ షిప్‌లోని ప్రతీ విషయాన్ని ఆస్వాదించాలని.. ఓ బంధాన్ని సంతోషంగా మార్చుకునే సమయంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా వాటిని స్వీకరించాలని విజయ్ వర్మ అన్నారు. 'రిలేషన్ షిప్‌ను ఓ ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదించాలి. అలా చేసినప్పుడే ఎవరైనా సంతోషంగా ఉండగలరు. బాధ, కోపం, చిరాకు, సంతోషం.. ఇలా ప్రతీ అంశాన్ని నువ్వు స్వీకరించాలి. దానితో పాటే ముందుకు సాగాలి.' అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. తమన్నాతో బ్రేకప్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: టాలీవుడ్ లోకి ఎస్పీ చరణ్ రీఎంట్రీ... ఆయన తెలుగులో చేసిన లాస్ట్ మూవీ ఏంటో తెలుసా ?
'లవ్ బిజినెస్ అయితే సమస్యలు'
మరోవైపు.. నటి తమన్నా సైతం ఇటీవల ప్రేమ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూడడం మొదలుపెడతామో అప్పుడే అసలు సమస్యలు వస్తాయని అన్నారు. 'నిస్వార్థంగా ఉన్న ప్రేమనే నేను నమ్ముతాను. భాగస్వామి ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. రిలేషన్‌లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నా. జీవితంలో అద్భుతాలు జరగాలని ఎవరూ ఎదురుచూడొద్దు. అద్భుతాలు మనమే సృష్టించాలి.' అని అన్నారు. ఎప్పుడూ అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసే నటి ఇలా పోస్ట్ చేయడంతో ఆమె బ్రేకప్ గురించే మాట్లాడారంటూ ప్రచారం సాగింది.
ఇటీవలే తమన్నా, విజయ్ వర్మ హోలీ వేడుకల్లో సందడి చేశారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో పాల్గొన్న ఇద్దరూ వేర్వేరుగా వచ్చి.. విడివిడిగానే ఫోటోగ్రాఫర్లను పలకరించుకుంటూ విషెష్ చెప్పి వెళ్లిపోయారు. దీంతో వీరి బ్రేకప్ వార్తలకు బలం చేకూరింది. అంతకు ముందు ఏ పార్టీలకు గానీ.. ఈవెంట్లకు గానీ ఇద్దరూ కలిసే వెళ్లేవారు.
2023లో 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ సమయంలో తమన్నా, విజయ్ వర్మ ప్రేమలో పడ్డారు. ఈ సిరీస్ రిలీజ్ కాక ముందే వీరిద్దరూ కలిసి గోవాలో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య లవ్‌ను తమన్నా బయటపెట్టారు. బాలీవుడ్ 'లవ్ బర్డ్స్'గా పేరొందిన వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం సాగింది. అయితే, ఇటీవలే వీరి మధ్య రిలేషన్ షిప్ బ్రేక్ అయ్యిందని పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి.
అదే కారణమా?
తమన్నా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపించగా.. విజయ్ వర్మ మాత్రం కెరీర్‌పై ఫోకస్ చేయాలని.. పెళ్లికి కాస్త టైం కావాలని భావించారట. దీంతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని.. అందుకే బ్రేకప్ జరిగిందంటూ బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

