అన్వేషించండి

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!

Prime Minister Modi: విందు భేటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల పనితీరుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత యాక్టివ్ గా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

Prime Minister Modi took a class for BJP MPs from Telugu states:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్  బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ అల్పాహార విందు ఇచ్చారు.  పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. రాష్ట్రాల్లో పార్టీ  పరిస్థితి, ప్రతిపక్ష పాత్ర వంటి వాటిపై మాట్లాడారు.   ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని ప్రశంసించారు.  వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలకు బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని అడిగినట్లుగా చెబుతున్నారు.  తెలంగాణలో పార్టీ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించకపోవడంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 
 
గురువారం దిల్లీలో ప్రధాని మోదీ ఏపీ, తెలంగాణ, అండమాన్ కు చెందిన 15 మంది ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. సుమారు అరగంట పాటు ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల్లో పార్టీ పరిణామాలు, ప్రభుత్వ చర్యలు, రాజకీయ వ్యూహాలపై దృష్టి సారించారు. ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా  వస్తున్నాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి చాలా మంచి అవకాశమని మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర పరిపాలనపై మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోందని, ఇది  బీజేపీకి  కూడా ప్రయోజకరమని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందన్నారు. 
  
వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు భాజపా దీటుగా స్పందించాలని ఎంపీలకుప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, కేంద్ర-రాష్ట్ర సహకారాలపై వైసీపీ చేస్తున్న దాడులకు పార్టీ నేతలు, ఎంపీలు సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వాలని ఆయన సూచించారు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ విషయంపై   ఎంపీలు, నేతలు మరింత యాక్టివ్‌గా ఉండాలని మోదీ హైలైట్ చేశారు.

తెలంగాణ బీజేపీ ఎంపీల తీరుపై విమర్శలు

తెలంగాణలో  బీజేపీ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించడం లేదని, మంచి టీమ్ ఉన్నప్పటికీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదుర్కొనే అంశాలను హైలైట్ చేయడంలో, పార్టీ గ్రాఫ్‌ను పెంచుకోవడంలో ఎంపీలు, నేతలు సీరియస్ గా పని చేయడం లేదని  ఆయన విమర్శించారు. తెలంగాణలో  మంచి అవకాశాలు ఉన్నా, వాటిని ఉపయోగించుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని మోదీ పేర్కొన్నారు.  
 
తెలుగు రాష్ట్రాల ఎంపీలు జాతీయ పరిణామాలపై మరింత యాక్టివ్‌గా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. పలు రాష్ట్రాల్లో పర్యటించి, కేంద్ర ప్రభుత్వ చర్యలు, జాతీయ సంకల్పాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు. ‘వికసిత భారత్’, ‘అమృత్ కాలం’ వంటి కార్యక్రమాలపై ఎంపీలు ప్రచారం చేయాలని, ఇతర రాష్ట్రాల్లో భాజపా బలోపేతానికి కృషి చేయాలని మోదీ చెప్పారు. అండమాన్ ఎంపీలపై  ఆయన సానుకూల వ్యాఖ్యలు చేశారు.                                 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Abhishek Banerjee Attack Sonarpur: గుడ్లతో దాడి - హెల్మెట్ పెట్టుకుని వెళ్లిపోయిన మమతా బెనర్జీ మేనల్లుడు - బెంగాల్‌లో కలకలం
గుడ్లతో దాడి - హెల్మెట్ పెట్టుకుని వెళ్లిపోయిన మమతా బెనర్జీ మేనల్లుడు - బెంగాల్‌లో కలకలం
Breaking News: అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్ అరెస్టు
అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్ అరెస్టు
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ
IT Manager turns Auto Driver: ఐటీ ఉద్యోగం కన్నా ఆటో డ్రైవర్ పనే సూపర్ - ఈ మహిళ రియల్ స్టోరీ వింటే కనెక్టయిపోతారు!
ఐటీ ఉద్యోగం కన్నా ఆటో డ్రైవర్ పనే సూపర్ - ఈ మహిళ రియల్ స్టోరీ వింటే కనెక్టయిపోతారు!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
Regional sentiment gimmicks ahead of GHMC Elections | GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
Tesla Launches Y Premium Variant: టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు
టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు
Embed widget