రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో యంగ్ ఓపెనర్ యశశ్వి జైస్వాల్ తన కెరీర్లో తొలి వన్డే సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు చాలా కష్ట పడ్డ జైస్వాల్.. హాఫ్ సెంచరీ బాదే వరకు చాలా నెమ్మదిగా ఆడాడు. అయితే ఆ టైంలో రోహిత్ తనతో మాట్లాడుతూ.. టెన్షన్ పడొద్దని, ప్రశాంతంగా ఆడాలంటూ ధైర్యాన్నిచ్చాడని యశ్వశ్వి చెప్పాడు. అవసరమైతే తాను రిస్క్ తీసుకుంటాను కానీ.. తనను మాత్రం జాగ్రత్తగా ఆడాలని రోహిత్ ఇచ్చిన భరోసాతోనే సెంచరీ బాదగలిగానని చెప్పిన యశ్వశ్వి.. రోహిత్ భాయ్ గొప్ప మనసుకు అది నిదర్శనమంటూ ఆకాశానికెత్తేశాడు.
అయితే ఇప్పుడే కాదు.. యశ్వశ్వి అవకాశం దొరికినప్పుడల్లా రోహిత్ శర్మను ప్రశంసిస్తూనే ఉంటాడు. రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడని, అతడి గేమ్ వేరే లెవెల్ ఉంటుందంటూ ఎన్నోసార్లు హిట్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన జైస్వాల్.. రోహిత్, కోహ్లీ వంటి లెజెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడటం తన ఆటకి ఎంతగానో ఉపయోగపడుతోందన్నాడు. దీన్ని బట్టి రోహిత్‌ని యశ్వశ్వి జైస్వాల్.. జస్ట్ ఓ సీనియర్‌లా.. లేదంటే మాజీ కెప్టెన్‌లా కాకుండా.. ఓ మెంటార్‌లా, ఓ అన్నయ్యలా కూడా చూస్తాడని క్లియర్‌గా అర్థమవుతోంది.





















