అన్వేషించండి

Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు

Jayachandra Reddy : ములకలచెరువు నకిలీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. కేసు నమోదైనప్పటి నుండి ఆయన పరారీలో ఉన్నారు.

Expelled Telugu Desam Party leader Jayachandra Reddy arrested:  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా పేరుకున్న తెలుగుదేశం పార్టీ  బహిష్కృత నేత డి. జయచంద్రారెడ్డిని ఎక్సైజ్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఆయన్ను రాష్ట్రానికి తీసుకువచ్చి మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు.   కేసులో అరెస్టుల సంఖ్య 32కి చేరింది. ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావుతో జయచంద్రారెడ్డి మధ్య ఆర్థిక సహకారాలు, చీకటి ఒప్పందాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలో గత ఆక్టోబర్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులు నకిలీ మద్యం తయారీ యూనిట్‌ను బయటపెట్టారు. ఇక్కడ రోజుకు వేలాది లీటర్ల నకిలీ మద్యాన్ని  తయారుచేసి, బెల్ట్ షాపులు, బార్‌లకు సరఫరా చేస్తూ లక్షలాది రూపాయల లాభాలు పొందినట్లు తేలింది. ఈ యూనిట్‌లో ఇండస్ట్రియల్ స్పిరిట్, మెథనాల్ వంటి మర్మమైన పదార్థాలను కలిపి తక్కువ ధరకు మద్యాన్ని తయారుచేసి, అసలు బ్రాండ్ లేబుల్స్‌తో బాటిల్స్ సిద్ధం చేసి అమ్ముతున్నారు. 

ప్రధాన నిందితుడు (ఏ-1) అద్దేపల్లి జనార్దన్ రావు, విజయవాడలో ఏఎన్‌ఆర్  నిర్వాహకుడు. ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్ మోహన్ రావు సహా 14 మంది ప్రధాన నిందితులు ఈ రాకెట్‌ను నడిపారు. రిమాండ్ రిపోర్టుల ప్రకారం, జనార్దన్ రావు దక్షిణాఫ్రికా, రgవాండా వంటి దేశాల్లో మద్యం ఫ్యాక్టరీలు నడుపుతూ, ఆ అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 31 మంది అరెస్టులు జరిగాయి. జనార్దన్ రావును గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. 
 
రిమాండ్ రిపోర్టుల్లో గుర్తించినట్లుగా, ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారమంతా జయచంద్రారెడ్డి కనుసన్నల్లోనే సాగింది. జనార్దన్ రావుకు ఆర్థిక సహకారాలు, రక్షణ అందించినట్లు పోలీసులు ఆరోపించారు.   చీకటి ఒప్పందాలు ఉన్నాయనే  ఆధారాలు బయటపడ్డాయి.  జనార్దన్ రావు వీడియోలో జయచంద్రారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినప్పటికీ, పోలీసులు ఆయన పాత్రను దర్యాప్తు చేస్తున్నారు. 

జయచంద్రారెడ్డి (ఏ-17) తంబళ్లపల్లె నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన తర్వాత టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉండగా ఈ లిక్కర్ స్కాం బయటపడిన తరవాత పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.  ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి (ఏ-18) కూడా నిందితుల్లో ఉన్నారు. ఆయన పీఏ రాజేష్, అకౌంటెంట్ అన్బురాజ్, కారు డ్రైవర్ సయ్యద్ కలీం అష్రఫ్, ఇంటి బాబు అన్బురాసు వంటి సన్నిహితులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టులు జయచంద్రారెడ్డి పాత్రను మరింత స్పష్టం చేస్తున్నాయి.
 
జయచంద్రారెడ్డి మొదట బీఈ చదివి, బెంగళూరులో ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంజినీర్‌గా పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2024 ఎన్నికల ముందు వైసీపీ (YSRCP) నుంచి టీడీపీలో చేరారు. అనంతపురం జిల్లా తంబళ్లపల్లె అసెంబ్లీ  నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.  ఈ కేసు బయటపడిన తర్వాతే టీడీపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆక్టోబర్ 6న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు జయచంద్రారెడ్డి, స్థానిక నేత కట్టా సురేంద్ర నాయుడులను సస్పెండ్ చేశారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Advertisement

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Embed widget