Vedic Astrology :శని సంచారం, సూర్యగ్రహణం ప్రభావంతోనే థాయిలాండ్-మయన్మార్ భూకంపం!
Vedic Astrology :శని సంచారం, సూర్యగ్రహణం ప్రభావంతోనే థాయిలాండ్-మయన్మార్ భూకంపం! జ్యోతిష్య అంచనాల విశ్లేషణ ఇదే. భవిష్యత్‌లో కూడా విపత్తులు ఉంటాయని అంటున్నారు.

Vedic Astrology :థాయిలాండ్, మయన్మార్ సంభవించిన భయంకరమైన భూకంపానికి ప్రపంచమంతా షేక్ అయింది. ఇది కేవలం యాదృచ్చికమా లేదా దీని వెనుక గ్రహాల కదలికల ప్రభావం ఉందా. దీని గురించి ఏదైనా రహస్యం దాగి ఉందా? రేపు అంటే 29 మార్చి 2025న శనిదేవుడు మీన రాశిలోకి వస్తున్నాడు. అదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. వైదిక జ్యోతిష్యం ప్రకారం, ఇంత పెద్ద గ్రహ మార్పులు జరిగినప్పుడు... భూమిపై భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు వంటి ప్రకృతి విపత్తులు (Natural Disasters) జరుగుతాయట.
ఈ ఖగోళ సంఘటనలు కేవలం పురాణాలా లేదా వాటి వెనుక ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా? 2025 శని సంచారం, సూర్యగ్రహణం, భూకంపం మధ్య ఏదైనా రిలేషన్ ఉందా జ్యోతిష్యం, శాస్త్రీయ దృక్కోణాల నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి ముప్పు ఎక్కడ ఉంది? 2025లో ప్రపంచం అతి పెద్ద ప్రకృతి విపత్తు ఎదుర్కోనుందా చూద్దాం.
ప్రకృతి విపత్తులు (Natural Disasters), గ్రహాల ప్రభావం: జ్యోతిష్యం ఏమి చెబుతుంది?
మయన్మార్, థాయిలాండ్‌లో వచ్చిన భూకంపం (Earthquake) ప్రపంచాన్ని కదిలించింది. వైదిక జ్యోతిష్యం (Vedic Astrology) ప్రకారం, ప్రధాన గ్రహాలు సంచారం (Transit) సమయంలో సూర్యగ్రహణం (Solar Eclipse) వంటి ముఖ్యమైన ఖగోళ సంఘటనలు జరిగినప్పుడు, భూమిపై అసమతుల్యత ఏర్పడవచ్చు.
శని సంచారం 2025 (Shani Transit 2025): ఇది ప్రపంచ సంక్షోభం (Global Crisis) ను ఊహిస్తుందా?
29 మార్చి 2025న శని మీన రాశి (Pisces)లోకి వస్తున్నాడు. ఈ మార్పు జ్యోతిష్యపరంగా మాత్రమే కాకుండా ప్రపంచ సంఘటనల (Global Events) పైనా ప్రభావం ఉంటుంది. మీన రాశి (Pisces Zodiac) జల మూలకంతో ముడిపడి ఉంది. శని సంచారం జల మూలకంలో సంభవించే అల్లకల్లోలాలను సూచిస్తుంది. దీని వలన భూకంపాలు (Earthquakes), సునామీలు (Tsunamis), తుఫానులు (Cyclones) సముద్ర ప్రమాదాల (Oceanic Accidents) సంఖ్య పెరుగుతుంది.
శని దేవుడు జల రాశుల్లోకి ప్రవేశించినప్పుడల్లా ప్రపంచం విధ్వంసకర ఘటనలను చూసిన చరిత్ర ఉంది.
2004 హిందూ మహాసముద్ర సునామీ (Indian Ocean Tsunami): ఆ సమయంలో శని కర్కాటక రాశి (Cancer - Water Element) లో ఉన్నాడు.
2011 జపాన్ భూకంపం, సునామీ (Japan Earthquake and Tsunami): ఆ సమయంలో శని కన్య (Virgo) రాశిలో ఉన్నాడు.
1905 కంగ్రా భూకంపం (Kangra Earthquake): ఆ సమయంలో కూడా శని జల మూలక రాశి మీనంలో ఉన్నాడు. అక్కడ సూర్యుడు, బుధుడు, కేతువుల కలయిక ఏర్పడింది.
సూర్యగ్రహణం 2025 (Solar Eclipse 2025) భూకంపం (Earthquake) నేరుగా సంబంధం!
29 మార్చి 2025న సూర్యగ్రహణం (Solar Eclipse) ఉంది. జ్యోతిష్యం ప్రకారం, సూర్యుడు (Sun), చంద్రుడు (Moon) ఒకే వరుసలో ఉన్నప్పుడు, భూమి గురుత్వాకర్షణ క్షేత్రం (Gravitational Field) పై ప్రభావం పడుతుంది. ఇది సహజ విపత్తులు (Natural Disasters), భూకంపాలు (Earthquakes), అగ్నిపర్వత పేలుళ్లు (Volcanic Eruptions) జరగొచ్చు. గ్రహాల లెక్కల ద్వారా కూడా ఈ సంవత్సరం ఇటువంటి ప్రమాదకర సంకేతాలు ఉన్నాయి. దీనితో పాటు శని, గురు, రాహు, కేతువులు మారుతున్న స్థితి పెద్ద మార్పులకు సంకేతాలు ఇస్తున్నాయి.
శాస్త్రీయ, జ్యోతిష్య విశ్లేషణ (Scientific and Astrological Analysis): ఇది కేవలం అపోహమా?
శాస్త్రీయంగా(Scientific Perspective) చూస్తే భూకంపాలు (Earthquake) భూమి టెక్టోనిక్ ప్లేట్లు (Tectonic Plates) కదలికల వల్ల వస్తాయి. కానీ జ్యోతిష్యం (Astrology) భారీ గ్రహాలు (ఉదాహరణకు శని - Shani) సంచారం (Transit) చేసినప్పుడు, సూర్యగ్రహణం (Solar Eclipse) వంటివి వచ్చినప్పుడ, భూమిపై శక్తి (Energy) అసమతుల్యత చెందవచ్చునని చెబుతుంది.
రాబోయే కాలం ఎలా ఉంటుంది?
రాబోయే నెలల్లో భూకంపాలు (Earthquakes), అగ్నిపర్వత విస్ఫోటనాలు (Volcanic Eruptions), సునామీలు (Tsunamis) సంభవించే అవకాశం పెరుగుతుంది. జ్యోతిష్య లెక్కలు 2025 మొదటి ఆరు నెలలు ప్రపంచానికి సవాలుగా ఉండవచ్చని సూచిస్తున్నాయి. మీన రాశిలో 6 గ్రహాల కలయిక శాస్త్రాల్లో విపత్తును తెచ్చేదిగా పరిగణిస్తారు. కాబట్టి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది అంటున్నా జోత్యిష్యలు.





















