Dhoodh Sharbat Recipe : రంజాన్ స్పెషల్ దూద్ షర్బత్ రెసిపీ.. సమ్మర్లో చల్లగా తాగేందుకు బెస్ట్, టేస్టీ డ్రింక్
Sharbat Recipe : రంజాన్ అంటే బిర్యానీ, సేమ్యా వంటి వివిధ టేస్టీ వంటలు గుర్తొస్తాయి. అయితే సమ్మర్లో అందరూ కలిసి ఎంజాయ్ చేయగలిగే చల్లని, టేస్టీ షర్బత్ రెసిపీ ఇక్కడుంది. చూసేయండి.

Ramadan 2025 Special Dhoodh Sharbat Recipe : రంజాన్ మాసం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. మార్చి 31వ తేదీన రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. ఈ సమయంలో సమ్మర్ స్పెషల్‌గా, టేస్టీగా, చల్లని షర్బత్‌ను ట్రై చేయాలనుకుంటే దూద్ షర్బత్ బెస్ట్ ఆప్షన్. దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇంట్లోనే అతి తక్కువ, సింపుల్ పదార్థాలతో ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయగలిగే సమ్మర్ స్పెషల్ దూద్ షర్బత్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి దీనిని చేయడానికి అవసరమైన పదార్థాలు ఏంటో.. తయారీ విధానం ఏంటో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
- పంచదార - 1 కప్పు
- నీళ్లు - పావు కప్పు
- పాలు - 4 కప్పులు
- కస్టర్డ్ - 1 టేబుల్ స్పూన్
- పాలు - 2 టేబుల్ స్పూన్లు
- కుంకుమ పువ్వు - అర టీస్పూన్
- యాలకుల పొడి - టీస్పూన్
- చియా సీడ్స్ - 1 టేబుల్ స్పూన్
- బాదం, పిస్తా పలుకులు - 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ ఉంచాలి. దానిలో పంచదార వేసి.. మంట సిమ్‌లో ఉంచి తిప్పుతూ ఉండాలి. పంచదార కరగడం స్టార్ట్ అవుతుంది. పంచదార గట్టిపడకుండా పక్కనే ఉంటూ దానిని కలుపుతూ ఉండాలి. పంచదార కరిగి రంగు మారుతుంది. పొంగు వస్తూ రంగు మారిన సమయంలో దానిలో పావు కప్పు నీళ్లు వేయాలి. ఇప్పుడు నీళ్లలో పంచదార కరిగేలా తిప్పుతూ బాగా కలపాలి. మంటను మాత్రం సిమ్‌లోనే ఉంచాలి. కుంకుమ పువ్వును నానబెట్టకోవాలి.
Also Read : రంజాన్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ.. టేస్టీగా అరోమాతో రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి
పాలను కూడా పంచదార మిశ్రమంలో వేసి బాగా కలపాలి. పాలు, పంచదార కలిసిపోతూ.. ఉండాలి. అలాగే కలుపుతూనే ఉండాలి. ఇలా 4 నుంచి 5 నిమిషాలు కలిపుతూ ఉడికించుకోవాలి. ఈలోపు ఓ చిన్న గిన్నెలో కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. దానిలో రెండు టేబుల్ స్పూన్లు పాలు వేసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టౌవ్ మీద మిశ్రమంలో వేసి మరోసారి బాగా కలపాలి. పిండి గడ్డకట్టకుండా తిప్పుతూనే ఉండాలి.
నానబెట్టుకున్న కుంకుమ పువ్వును ఈ మిశ్రమంలో వేయాలి. అనంతరం యాలకుల పొడి వేసి మరగనివ్వాలి. ఇలా మరో 5 నిమిషాలు ఉడికించిన తర్వాత దానిని వేరే గిన్నెలోకి మార్చి రూమ్ టెంపరేచర్‌కి రానివ్వాలి. అనంతరం రెండు గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. చియా సీడ్స్ లేదా బేసిల్ సీడ్స్‌ని నీటిలో నానబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోనుంచి తీసిన షర్బత్‌లో నానబెట్టుకున్న చియాసీడ్స్ వేసి కలపాలి. బాదం, పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ దూద్ షర్బత్ రెడీ. ఈ సింపుల్, టేస్టీ షర్బత్‌ని రంజాన్ సమయంలోనే కాదు.. సమ్మర్‌లోనూ టేస్టీగా, చల్లగా తాగాలనుకునేప్పుడు సింపుల్‌గా రెడీ చేసేయొచ్చు.
Also Read : టేస్టీ టేస్టీ షీర్ ఖుర్మా రెసిపీ.. రంజాన్ స్పెషల్ స్వీట్ ఇదే























