అన్వేషించండి

Mutton Biryani Recipe : రంజాన్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ.. టేస్టీగా అరోమాతో రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి

Ramzan Recipes : రంజాన్ వచ్చేసింది. ఈ సమయంలో చాలామంది బిర్యానీ, ఖీర్​ గురించి ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ముస్లింల స్టైల్​లో టేస్టీ మటన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 

Ramzan Specail Mutton Dum Biryani Recipe : ముస్లింలు చేసుకునే అత్యంత ప్రధాన పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ సమయంలో వారు వండుకునే పదార్థాలు అంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా వారు చేసే బిర్యానీని చాలా ఇష్టంగా తింటారు. అయితే రంజాన్ సమయంలో మీరు కూడా ముస్లింల స్టైల్​లో మంచిగా అరోమేటిక్​గా, టేస్టీగా చేసుకోవాలనుకుంటే మీరు ఈ రెసిపీని ఫాలో అవ్వొచ్చు. ఈ బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? తయారీ విధానం ఏంటి? ఏ టిప్స్​ ఫాలో అయితే మటన్ బిర్యానీ టేస్టీగా వస్తాదో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

ఉల్లిపాయలు - పావు కిలో

నూనె - అరకప్పు

మటన్ మ్యారినేషన్ కోసం.. 

మటన్ - 1 కిలో

పచ్చి బొప్పాయి తొక్క - పావు కప్పు

పచ్చిమిర్చి - 4 

జాజికాయ పొడి - అర టీస్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు

మీడియం సైజ్ ఉల్లిపాయలు - 3

ఉప్పు - రుచికి తగినంత 

ధనియాల పొడి - 2 స్పూన్స్

జీలకర్ర పొడి - 2 టీస్పూన్

కారం - 3 టేబుల్ స్పూన్లు 

పసుపు - పావు టీ స్పూన్

గరం మసాలా  - 1 టేబుల్ స్పూన్

జీలకర్ర - 1 స్పూన్

లవంగాలు - 7

దాల్చిన చెక్క - 2 అంగుళాలు

బిర్యానీ ఆకులు - 2 

యాలకులు - 5

నిమ్మకాయ రసం - 2 టీస్పూన్లు

నెయ్యి - ఒకటిన్నర టేబుల్  స్పూన్లు

పెరుగు - 250 మి.లీ 

కుంకుమపువ్వు పాలు - 1టేబుల్ స్పూన్

పుదీనా - చిన్న కట్ట

కొత్తిమీర - చిన్న కట్ట 

బియ్యం ఉడకబెట్టేందుకు 

నీరు - 3 లీటర్లు 

యాలకులు - 5

లవంగాలు - 10 

యాలకులు - 4

దాల్చిన చెక్క - 2 అంగుళాలు

జీలకర్రం - 1 టేబుల్ స్పూన్

స్టార్ పువ్వు - 2

పుదీనా - కట్ట

కొత్తిమీర - చిన్న కట్ట

నిమ్మరసం - కొద్దిగా 

జాపత్రి - కొద్దిగా

బిర్యానీ ఆకులు - 3

ఉప్పు - రుచికి తగినంత 

బాస్మతి రైస్ - అరకిలో 

తయారీ విధానం

ముందుగా బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు వేసి డీప్​గా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ నూనెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకుని దానిలో పచ్చిబొప్పాయి తొక్కను, పచ్చిమిర్చి, అర టీస్పూన్ జాజికాయపొడి, కొన్ని నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మందపాటిగా ఉండే పెద్ద బిర్యానీ గిన్నె తీసుకోండి. దీనిలో మీడియం సైజ్​లో కట్ చేయించుకున్న మటన్ వేసుకోవాలి. మీరు తీసుకునే మటన్ ఎప్పుడూ లేతగా, మంచిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే బిర్యానీ బాగా వస్తుంది. ఇప్పుడు మటన్​ను మ్యారినేట్ చేసుకోవాలి.

మటన్​లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిబొప్పాయి పేస్ట్, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, టేబుల్ స్పూన్ గరం మసాలా, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, మరాఠీ మొగ్గలు.. ముందుగా ఉల్లిపాయలు వేయించగా మిగిలిన నూనెను వేసుకోవాలి. ఇవన్నీ వేసి.. మటన్​లో మిక్స్​ అయ్యేలా వీటిని బాగా కలపాలి. ఇలా కలిపిన మిక్స్​లో నిమ్మరసం, నెయ్యి, సగం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. చివర్లో పెరుగు కూడా వేసి మరోసారి బాగా మిక్స్​ అయ్యేలా కలపాలి. దీనిని ఎంత బాగా కలిపితే అంత మంచిగా మటన్​కు మసాలా అందుతుంది. కుంకుమ పువ్వు నీరు వేసి బాగా కలిపిన మటన్​ను మూడు గంటలు ఫ్రిజ్​లో పెట్టాలి. రాత్రంతా మేరినేట్ చేసిన కూడా మంచిది. 

బిర్యానీ చేసే ఓ అరగంట ముందు బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. అనంతరం స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో నీరు వేసి మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు యాలకులు, లవంగాలు, జీలకర్ర, ఉప్పు, జీలకర్ర పొడి, దాల్చిన చెక్క,షాజీర, అనాస పువ్వులు, జాపత్రి, బిర్యానీ ఆకులు వేయాలి.  మసాలాలు బాగా మరిగిన తర్వాత దానిలోని ఓ చిన్న గ్లాస్ నీటిని తీసుకుని.. దానిని మటన్​ మేరినేషన్​లో వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల బిర్యానీ చేసినప్పుడు కింద అడుగు పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా మటన్ తొందరగా ఉండుకుతుంది. 

బిర్యానీ గిన్నె అంచులకు ఉన్న మసాలాను తుడిచేయండి. లేదంటే అడుగు పట్టే అవకాశాలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో నానబెట్టిన బియ్యం వేయండి. కాస్త పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసి సగం ఉడకనివ్వాలి. దానిలోని సగం రైస్​ తీసుకుని.. బిర్యానీ గిన్నెలోని మటన్ మీద లేయర్​గా వేయాలి. ఇప్పుడు మిగిలిన సగాన్ని మరికొంత ఉడికించి.. ముందు వేసిన రైస్​ మీద లేయర్​గా వేయాలి. రైస్​ను నొక్కితే బిర్యానీ సరిగ్గా రాదు. అందుకే వాటిని లేయర్​గా వేయాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై దోశ పెనం పెట్టండి. అది వేడి అయ్యాక.. బిర్యానీ గిన్నెను పెట్టండి. మంటను తగ్గించి సిమ్​లో ఉంచి.. బిర్యానీ గిన్నెలో రైస్​పై కొత్తిమీరు, పుదీనా తురుము, ఫ్రై చేసిన ఆనియన్స్ వేయాలి. 

చివరిగా దానిపై కుంకుమ పువ్వు నీరు, నెయ్యి, రైస్​ని ఉండికించగా మిగిలిన నీరు అంచుల వెంట వేయండి. పావు టీ స్పూన్ గరం మసాలా వేయండి. ఇప్పుడు బిర్యానీ గిన్నె అంచుల వెంబడి తడిని చేసి.. కలిపి పెట్టుకున్న పిండిని చుట్టూ అతికించండి. దానిపై మూతపెట్టి.. ఆపైన బరువును ఉంచండి. ఇప్పుడు స్టౌవ్​ మంటని హైలో ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత గిన్నె నుంచి స్టీమ్ బయటకు వస్తుంది. అలా వచ్చిన వెంటనే స్టౌవ్​ని సిమ్​లో ఉంచి.. మరో 20 నిమిషాలు ఉడికించాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి దానిని మరో 20 నిమిషాలు అలానే ఉంచేయాలి. దీనివల్ల బిర్యానీ ముద్దగా కాకుండా పొడిపొడిలాడుతూ.. మసాలాలు అన్ని మంచి అరోమానిస్తూ.. టేస్టీ బిర్యానీ మీ ముందు ఉంటుంది. రంజాన్ స్పెషల్​గా చేసుకోవాలంటే మీరు దీనిని ఫాలో అవ్వొచ్చు. 

Also Read : అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే అవిసెగింజల కారంపొడి.. ఇలా చేస్తే రెండునెలలు నిల్వ ఉంటుంది

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget