మామిడి టెంకలను పడేయొద్దు, ఎన్ని ప్రయోజనాలో తెలుసా? మామిడి పండు లేదా కాయలను తిన్న తర్వాత మనం టెంక(విత్తనం) పడేస్తాం. అయితే, ఆ టెంకలో కూడా బోలడన్ని పోషకాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. రక్తహీనత(Anemia)ను నయం చేసే పోషకాలు మామిడి టెంకలో ఉన్నాయట. మామిడి టెంకలో అనేక యాంటీ ఆసిడ్స్ ఉంటాయి. అవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా మొటిమలు, ముడతలను తగ్గిస్తుంది. వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. ఇది డయాబెటిస్ బాధితులకూ మంచిదేనని న్యూట్రిషన్ అండ్ మెటబాలిక్ ఇన్‌సైట్స్ అనే జర్నల్ 2014లో పేర్కొంది. మామిడి టెంకలు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే కొన్ని టూత్ పౌడర్లలో మామిడి టెంకలను వాడతారు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ, ఒక్క విషయం.. డాక్టర్, ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఇవి పాటించాలి.