అందుకే, సమ్మర్‌లో పుచ్చకాయలు తినాలట!

సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయల సీజన్ మొదలైనట్లే. చెప్పాలంటే.. అవి మనకోసమే కాస్తాయ్.

అర్థం కాలేదా? పుచ్చకాయలు మనకు ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో మన ప్రాణాలు రక్షిస్తాయ్.

అలాంటి మంచి పుచ్చకాయను సమ్మర్‌లో నిర్లక్ష్యం చేయడం చాలా పాపం.

పుచ్చకాయలో 90 శాతం నీరే ఉంటుంది. కాబట్టి, డిహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది.

పనిలో పనిగా పుచ్చకాయ మనకు A, C విటమిన్స్ కూడా అందిస్తుంది.

అంతేకాదు.. పుచ్చకాయలో బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయ్.

వేడి వాతావరణంలో పుచ్చకాయ తినడం మంచిదే. అది మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

ఇందులో క్యాలరీలు కూడా తక్కువే. కాబట్టి.. బరువు పెరుగుతానే బెంగ కూడా వద్దు.

ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. గుండెను సైతం కాపాడతాయి.