ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ అయినా తన ఫిట్‌నెస్‌ను మాత్రం పక్కన పెట్టలేదు రష్మిక. ఇక తను ఎంత బిజీగా ఉన్నా ఫిట్‌నెస్ ఎలా మెయింటేయిన్ చేస్తుందో బయటపెట్టింది ఈ భామ. కండరాలను బలంగా ఉంచుకునే వ్యాయామాలను ఎక్కువగా చేస్తుంది రష్మిక. ఏదేమైనా డైట్ ప్లాన్‌ను, రెగ్యులర్ వ్యాయామాన్ని అస్సలు పక్కన పెట్టదు. రష్మిక కిక్ బాక్సింగ్‌ను క్రమం తప్పకుండా చేస్తుంది. దాని వల్లే కండరాలు బలపడతాయని చెప్తుంది. శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉండడం కోసం ఎక్కువగా వ్యాయామాలు చేస్తుంది రష్మిక. స్క్వాట్స్ అనేవి రష్మిక డైలీ లైఫ్‌లో భాగం అయిపోయాయి. దీని వల్ల కొవ్వు తగ్గి, స్టామినా పెరుగుతుందట. జిమ్ బాల్‌తో వ్యాయామం చేయడం వల్ల శరీరానికి బలం చేకూరడంతో పాటు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఇక కార్డియో అయితే దాదాపు అందరు సినీ సెలబ్రిటీల లైఫ్‌లో తప్పనిసరి.(Images and Video Credit: Rashmika Mandanna/Instagram)